Ad Code

ఏఐ టూల్‌ 30 నిమిషాల్లోనే వెబ్‌సైట్‌ లేదా యాప్‌ డిజైన్‌ ?


కోడింగ్‌ రాయకుండానే అది కూడా కొద్ది నిమిషాల్లో వెబ్‌సైట్‌ క్రియేట్‌ చేయగల సామర్థ్యం ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇదే MetaGPT అసలు లక్ష్యం. ఇది జీపీటీ-4 ( జెనరేటివ్‌ ప్రీ ట్రైన్‌డ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌-4 ) మల్టీ మోడల్‌ లార్జ్‌ లాగ్వేజ్‌ మోడల్‌ని ఉపయోగించే ఆన్‌లైన్ వేదిక. చిన్న మైక్రోయాప్స్‌ క్రియేట్‌ చేసేందుకు చాట్‌జీపీటీకి ఇదే ఆధారం. దీన్ని "Picos" అని కూడా పిలుస్తారు. రేడియో స్టేషన్‌ కోసం ఆన్‌లైన్‌ ప్లేయర్‌, టిండర్‌ నాకాఫ్‌, వాయిస్‌ ట్రాన్స్‌క్రైబర్‌తో సహా అనేక వేలాది వెబ్‌ ఆధారిత అప్లికేషన్‌లు ఇప్పటికే క్రియేట్ చేశారు. MetaGPTను న్యూయార్క్‌కు చెందిన WhimsyWorks అభివృద్ధి చేసింది. అసలు కోడ్‌ అవసరం లేకుండా ఈ మెటాజీపీటీ.. వైబ్‌సైట్‌ లేదా ఆన్‌లైన్‌ యాప్‌గా మారుస్తుంది. ఇందుకు ఏఐ సాయం తీసుకుంటుంది. మీరు ఇటీవలే AI చాట్‌బోట్‌ను వినియోగిస్తే, మోటాజీపీటీ కూడా అదే విధంగా ఉంటుంది. మీరు ఏం కావాలని కోరుకుంటున్నారో టైప్‌ చేయాలని బ్రౌజర్‌ ఆధారిత బిల్డర్‌ అడుగుతుంది. గూగుల్ బార్డ్‌ లేదా చాట్‌జీపీటీ చాట్‌బోట్‌ అక్షరాల్లోనే సమాధాం ఇస్తుంది. అతే మెటా జీపీటీ మనం ఇచ్చే ఇన్‌పుట్‌ ఆధారంగా యాప్‌ను క్రియేట్‌ చేస్తుంది. కొత్త వెబ్‌సైట్‌ ఎలా ఉంటుందో బిల్డర్‌ మనకు చూపిస్తుంది. మెటాజీపీటీ తక్షణమే ఉపయోగించుకొనేందుకు అందుబాటులో ఉంటుంది. యాప్‌ క్రియేట్‌ చేసేందుకు ఉచితంగానే మనం ఇందులోకి లాగిన్‌ కావచ్చు. అయితే అన్‌లిమిటెడ్‌ యాప్‌, వెబ్‌సైట్లు క్రియేట్‌ చేయాలని కోరుకొనేవారు మాత్రం నెలకు 29 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అయితే మీరు నగదు చెల్లించే ముందు.. మీరు మొదట క్రియేట్‌ చేసిన ఇంటర్‌ఫేస్‌ను మార్చడం లేదా బగ్‌లను తొలగించేందుకు అనుమతించబడతారు. ఇలా నాలుగు సార్లు అప్‌డేట్‌ చేసుకోవచ్చు. మీరు చేయాలనుకున్న మార్పులు చేసి, సంతృప్తి చెందిన తర్వాత మీకు ఒక ప్రత్యేకమైన URL కేటాయిస్తారు. దాంతోపాటు మీకోసం కస్టమ్‌ డొమైన్‌ కూడా కొనుగోలు చేయవచ్చు. మీ ఐడియా సులభంగా ఉంటే, సైన్‌ అప్‌ చేయడం నుంచి వెబ్‌సైట్‌ పబ్లిష్‌ చేయడం కేవలం 30 నిమిషాల్లోనే పూర్తవుతుంది. మీ ఆలోచనలకు తగినట్లుగా వెంటనే వెబ్‌సైట్‌గా మార్చుకొనే అవకాశం ఉన్నా.. ప్రస్తుతం మెటాజీపీటీ మ్యూట్‌ చేయబడింది. వినియోగదారులు ఎంపిక ఆధారంగా న్యూస్‌ అగ్రిగేటర్‌ను క్రియేట్‌ చేయడం తమ మొదటి పరీక్ష సంస్థ తెలిపింది. మరియు కొద్ది నిమిషాల్లోనే టెక్ట్స్‌ నుంచి ఇమేజ్‌ను క్రియేట్ చేయడం తమకు చాలా ప్రతిష్మాతకమైందని వెల్లడించింది. మెటాజీపీటీ అనేది కేవలం సింగిల్‌ పేజీ వెబ్‌ యాప్‌ మాత్రమేనని అందుకోసమే ఇది రిజర్వ్‌ చేయబడిందని తెలిపింది. మొబైల్‌ యాప్ లేదా పెద్ద అప్లికేషన్‌ ఆలోచనలు ఉన్నవారు ప్రస్తుతానికి పక్కనపెట్టాలని కోరింది. ఏఐ అందుబాటులోకి వచ్చిన నుంచి అనేక రంగాల్లో ఈ టెక్నాలజీని ఎక్కువగా వినియోగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గూగుల్ బార్డ్‌ అయితే ఏకంగా 20 ప్రోగ్రామింగ్ భాషల్లో కోడింగ్‌ రాయగలదని సంస్థ తెలిపింది. దాంతోపాటు కోడింగ్‌పై సరైన విధంగా వివరించగలదని వెల్లడించింది.

Post a Comment

0 Comments

Close Menu