Ad Code

మోటో రేజర్ 40 ఆల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ !


దాదాపు స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థలు ఫోల్డబుల్‌ ఫోన్లను లాంచ్‌ చేస్తున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం ఫ్లిప్‌, పోల్డబుల్‌ ఫోన్లు ట్రెండింగ్‌లో ఉండగా ప్రస్తుతం మళ్లీ అవే స్మార్ట్‌ఫోన్లు ట్రెండ్‌ సృష్టించే అవకాశం ఉంది. యాపిల్‌, శ్యాంసంగ్‌, వన్‌ఫ్లస్‌ సహా మరికొన్ని ఫోన్లు ఫోల్టబుల్ ఫోన్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేశాయి. మోటోరోలా త్వరలో ఫోల్టబుల్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మోటో రేజర్ 40 అల్ట్రా ఫోన్‌   రేజర్ తదుపరి వెర్షన్‌గా రానున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే మోటరోలా రేజర్ 40కి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్లు బయటకు వచ్చాయి. టిప్‌స్టర్‌ Evan Blass (@eveleaks) ద్వారా  కొన్ని వివరాలు బయటకు వచ్చాయి. అయితే లీక్‌ అయిన ఫోటో నుంచి స్పెసిఫికేషన్లు తెలియనప్పటికీ  మోటో రేజర్‌ 40 ఆల్ట్రా డిస్‌ప్లేను బహిర్గతం చేశాయి. ప్రస్తుతం ఉన్న ఆధునిక క్లామ్‌షేల్‌ ఫోల్డింగ్ ఫోన్ల కంటే ఈ స్మార్ట్‌ఫోన్‌ డిస్‌ప్లే పెద్దదిగా ఉంటే అవకాశం ఉంది. మోటరోలా రేజర్‌ 40 ఆల్ట్రా నలుపు, సిల్వర్‌/గ్రే, మరియు మెజెంటా షేడ్స్‌లో ఉన్నాయి. మెజెంటా రంగు మోటరోలా ఎడ్జ్ 40 ఫోన్‌కు పోలినట్లు ఉంది. కొత్త కవర్‌ డిస్‌ప్లేతో మోటరోలా రేజర్‌ 40 ఆల్ట్రాను చూడడం కొంత ఆసక్తిగా ఉండవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ పెద్ద కవర్‌ డిస్‌ప్లే ఫంక్షనాలిటీని ఎనేబుల్‌ చేయాల్సి ఉంటుంది. వినియోగాన్ని ముందెన్నడు చూడని స్థాయికి తీసుకెళ్తుంది. మోటరోలా రేజర్‌ 40 ఆల్ట్రా స్నాప్‌ డ్రాగన్‌ 8+ జెన్‌1 Soc ప్రోసెసర్‌తో వచ్చే అవకాశం ఉంది. 12GB ర్యామ్‌ మరియు 256GB వేరియంట్‌తో అందుబాటులోని వచ్చే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 3640mAh బ్యాటరీ సామర్థ్యం మరియు 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ చేయనుందని సమాచారం. మరియు ఈ ఆండ్రాయిడ్‌ 13 MyUX లో పనిచేయనుందని తెలుస్తోంది. మోటరోలా రేజర్‌ 40 ఆల్ట్రా 6.9 అంగుళాల ఫోల్డబుల్‌ ఓలెడ్‌ డిస్‌ప్లే మరియు 120 Hz రీఫ్రెష్‌ రేట్‌తో రానుందని సమాచారం. అయితే ఈ రీఫ్రెష్ రేట్‌ 165Hz వరకు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు 12MP సోనీ IMX563 సెన్సార్‌ మరియు 13MP SK హైనిక్స్‌ Hi1336 ఆల్ట్రావైడ్‌ సెన్సార్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా 32MP సెల్ఫీ కెమెరాతో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. అయితే ధర, ఎన్ని వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది, ఎన్ని రంగుల్లో లాంచ్‌ కానుంది. 

Post a Comment

0 Comments

Close Menu