Ad Code

నుబియా ఫస్ట్ జడ్ 60 ఫోల్డబుల్ ఫోన్


నుబియా నుంచి మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోంది. ZTE యాజమాన్యంలోని స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మొదటి ఫోల్డబుల్ Z60 Fold స్మార్ట్‌ఫోన్‌ గ్లోబల్ మార్కెట్లోకి తీసుకొస్తోంది. కంపెనీ అధికారిక ప్రకటన కంటే ముందే ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. నుబియాఈ ఏడాది చివర్లో అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. 7.3-అంగుళాల AMOLED ఫోల్డబుల్ డిస్‌ప్లేతో రానుంది. స్నాప్‌డ్రాగన్ 8 సిరీస్ చిప్‌సెట్ అందించనుంది. Nubia Z60 ఫోల్డ్ ఫోన్ 512GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో రానుంది. 100W వైర్డు, వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీతో రానుందని భావిస్తున్నారు. Tipster Paras Guglani (@passionategeekz), ప్రైస్‌బాబా సహకారంతో Nubia Z60 ఫోల్డ్ లాంచ్ టైమ్‌లైన్, కీలక స్పెసిఫికేషన్‌లను లీక్ చేసింది. లీక్ డేటా ప్రకారం.. నుబియా ఫస్ట్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ 2023 నాల్గవ త్రైమాసికంలో రానుందని, కనీసం 3 కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. NX801J మోడల్ నంబర్‌తో రానుందని భావిస్తున్నారు. Nubia Z60 ఫోల్డ్ ఫోన్ 7.3-అంగుళాల AMOLED ఫోల్డబుల్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. హుడ్ కింద, స్నాప్‌డ్రాగన్ 8 సిరీస్ చిప్‌సెట్‌తో పాటు 12GB ర్యామ్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోల్డబుల్ ఫోన్ 256GB, 512GB స్టోరేజ్ వేరియంట్‌లలో రానుంది. 100W వైర్డు ఛార్జింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. Nubia Z60 ఫోల్డ్‌కి సంబంధించి Nubia ఇంకా ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. ఇటీవలి ఏళ్లలో Vivo, Motorola, Oppo, Xiaomi, Huawei, Tecno ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి రిలీజ్ చేశాయి. ఇటీవల, టెక్ దిగ్గజం గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ ఫోల్డబుల్ ఫోన్ కూడా గ్లోబల్ మార్కెట్లోకి ప్రవేశపెట్టినుంది. నుబియా Z60 ఫోల్డ్ పిక్సెల్ ఫోల్డ్, మోటో రేజర్ 2022, ఒప్పో ఫైండ్ N2 ఫ్లిప్, రాబోయే గెలాక్సీ Z ఫోల్డ్ 5 స్మార్ట్‌ఫోన్‌లను ప్రవేశపెట్టనుందని భావిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu