Ad Code

గూగుల్ పిక్సెల్ 6ఏపై భారీ తగ్గింపు !


గూగుల్ ఐఓ ఈవెంట్ గూగుల్ పిక్సెల్ 7 ఏ లాంచ్ చేసింది. దీంతో పిక్సెల్ 6ఏ పై భారీ తగ్గింపును ఆఫర్ చేస్తుంది. వెర్షన్‌తో సంబంధం లేకుండా గూగుల్ ఫోన్ కొనాలనుకునే వారికి ఇదో మంచి డీల్ అని మార్కెట్ రంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రారంభ రోజుల్లో సేల్స్‌లో దుమ్ము రేపిన పిక్సెల్ 6 ఏపై ప్రస్తుతం భారీ తగ్గింపు లభించడం మంచిదేనని పేర్కొంటున్నారు. గూగుల్ పిక్సెల్ 6ఏ లాంచ్ అయిన సందర్భంగా రూ.43,999 వద్ద లిస్ట్ అయిన ఈ ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.31,999కు అందుబాటులో ఉంది. అయితే ఈ ధర రోజురోజుకూ హెచ్చుతగ్గులకు గురవతూ ఉంటుంది. ముఖ్యంగా గూగుల్ పిక్సెల్ 7ఏ అమ్మకానికి రెడీగా ఉన్న సమయంలో ఈ ఫోన్ ధర ఇంకా తగ్గే అవకాశం ఉంది. అయితే అన్ని రోజులు వెయిట్ చేయలేం అనుకునే వారు ప్రస్తుతం ఉన్న ధరకే కొనుగోలు చేసుకోవడం ఉత్తమం. అలాగే ప్రస్తుతం ఉన్న ధరపై ఇప్పటికే కొన్ని బ్యాంకుల కార్డుల ద్వారా ఇన్‌స్టంట్‌గా 10 శాతం తగ్గింపు లభిస్తుంది. ప్రస్తుతం అయితే హెచ్‌డీఎఫ్‌సీ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.1000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. కాబట్టి మంచి ఆఫర్ వరకూ వేచి చూడలేని వారు ప్రస్తుతం ఈ మొబైల్ కొనుగోలు చేస్తే రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకూ తగ్గింపు లభిస్తుంది. ఈ ఫోన్ లో 6.1 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ ఓఎల్ఈడీ హెచ్ డీఆర్ డిస్ ప్లే ఉంటుంది. గొరిల్లా గ్లాస్ 3 ప్రోటెక్షన్ తో ఈ ఫోన్ వస్తుంది. 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ సామర్థ్యంతో ఇది వస్తుంది. కెమెరా విషయానికి వస్తే దీనిలో వెనుక వైపు 12ఎంపీ ప్రైమరీ కెమెరా, 12ఎంపీ అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటుంది. ముందు వైపు 8ఎంపీ సెల్పీ కెమెరా ఉంటుంది.

Post a Comment

0 Comments

Close Menu