Ad Code

ఎల్‌జీ రోలబుల్ ఓలెడ్ స్మార్ట్ టీవీ ధర రూ.80 లక్షలు !


ఎల్‌జీ రిలీజ్ చేసిన రోలబుల్ ఓలెడ్ స్మార్ట్ టీవీ ధర అక్షరాలా రూ.80 లక్షలు. ఈ స్మార్ట్ టీవీ రిలీజ్ అయినప్పుడు ధర రూ.75 లక్షలు. కానీ ఇప్పుడు ధర పెరిగిపోయింది. ప్రస్తుత ధర రూ.79,99,999. అంటే ఈ స్మార్ట్ టీవీ సొంతం చేసుకోవాలంటే రూ.80 లక్షలు ఖర్చు చేయాల్సిందే. ఎల్‌జీ చాలా ఏళ్ల క్రితమే రోలబుల్ ఓలెడ్ టీవీలను పరిచయం చేసింది. భారతదేశంలో ప్రీమియం సెగ్మెంట్‌లో ఈ టీవీ రిలీజ్ కావడం విశేషం. కన్స్యూమర్ టెక్నాలజీ అసోసియేషన్ నిర్వహించే సీఈఎస్ ఈవెంట్‌లో ఈ స్మార్ట్ టీవీని పరిచయం చేసింది ఎల్‌జీ. ఆ తర్వాత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఎల్‌జీ రిలీజ్ చేసిన ఈ రోలబుల్ టీవీని సులువుగా చాప చుట్టేసినట్టు చుట్టేయొచ్చు. ఇది 8కే ఓలెడ్ టీవీ. 42 అంగుళాల నుంచి 96 అంగుళాల ఓలెడ్ టీవీ వరకు వేర్వేరు ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. అందులో భాగంగా హైఎండ్ మోడల్‌లో రోలబుల్ టీవీ రిలీజ్ చేసింది. ఎల్‌జీ 2022 ఓలెడ్ టీవీ కొనాలంటే రూ.88,990 చెల్లిస్తే చాలు. కానీ రోలబుల్ టీవీ కొనాలంటే మాత్రం ధర రూ.75 లక్షలు చెల్లించాలి. ఈ టీవీకి ఇంత ధర ఎందుకన్న డౌట్ మీకు రావొచ్చు. ఇందులో రోలబుల్ టెక్నాలజీ ఉండటమే కారణం. అసలు ఈ స్మార్ట్ టీవీ ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటే ఆశ్చర్యమేస్తుంది. ఈ టీవీ ఓ బాక్సులో వస్తుంది. టీవీ చూడాలనుకున్నప్పుడు ఆన్ చేస్తే స్క్రీన్ పైకి రోల్ అవుతుంది. ఆఫ్ చేస్తే మళ్లీ బాక్సులోకి స్క్రీన్ రోల్ అవుతుంది. అంటే స్క్రీన్ చాప చుట్టినట్టుగా ఆటోమెటిక్‌గా రోల్ అవుతుంది. ఇలా జీవితకాలంలో 50,000 సార్లు టీవీని రోల్ చేయొచ్చని కంపెనీ చెబుతోంది. ఈ టెక్నాలజీ తప్ప మిగతా ఫీచర్స్ అన్నీ ఇతర ఓలెడ్ టీవీలో ఉన్నట్టుగానే ఉన్నాయి.  ఎల్‌జీ రోలబుల్ ఓలెడ్ టీవీలో 120Hz రిఫ్రెష్ రేట్, 4కే రెజల్యూషన్, హెచ్‌డీఆర్ సపోర్ట్, హెచ్‌డీఎంఐ 2.1, డాల్బీ విజన్, అమెజాన్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్, డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఎల్‌జీ సొంత వెబ్ఓఎస్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తోంది. అన్ని పాపులర్ యాప్స్ ఇందులో ఉంటాయి.  టీవీలో అల్‌ట్రా హెచ్‌డీ రెజల్యూషన్ సపోర్ట్ లభించడం విశేషం. ఇందులో గెమింగ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఎల్‌జీ ఏఐ థింక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ కూడా ఉంది. ఏఐ యూఎక్స్, ఏఐ హోమ్, ఏఐ రికమండేషన్, ఇంటెలిజెంట్ ఎడిట్, కన్వర్జేషనల్ ఏఐ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.  ఇందులో 100వాట్ స్పీకర్, 40వాట్ సబ్ వూఫర్ సపోర్ట్ ఉంది. బ్లూటూత్, వైఫై కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. 4 హెచ్‌డీఎంఐ పోర్టులు, 3 యూఎస్‌బీ పోర్టులు, 1 హెడ్‌ఫోన్ ఔట్‌పుట్ పోర్ట్ ఉన్నాయి. ఈ టీవీ, స్టాండ్ బరువు 91 కిలోలు ఉంటుంది. 

Post a Comment

0 Comments

Close Menu