Ad Code

జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ రూ.999 !


జియో సినిమా తన ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ప్రకటించింది. రూ.999 సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ 12 నెలలు అమల్లో ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికల మాదిరిగానే జియో సినిమా సినిమా యాప్ సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం జియో సినిమా ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ప్లాన్ తీసుకువచ్చింది. రూ.999 టారిఫ్ గల జియో సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ 12 నెలల పాటు అమల్లో ఉంటుంది. గేమ్స్ ఆఫ్ థ్రోన్స్, హార్రీపొట్టర్, సక్సెసన్, డిస్కవరీ వంటి షోలు, సినిమాలు జియో సినిమా యాప్ ద్వారా వీక్షించవచ్చు. ఒక్క ప్లాన్ సబ్‌స్క్రిప్షన్ నాలుగు డివైజ్‌ల్లో వీక్షించవచ్చు. ఇప్పటికే జియో సినిమా యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి 10 కోట్ల రెట్లకు పైగా యూజర్లు డౌన్‍లోడ్ చేసుకున్నారని తెలుస్తున్నది. జియో సినిమా యాప్ కోసం ముకేశ్ అంబానీ సారధ్యంలోని వయాకాం18 సంస్థ.. హాలీవుడ్‌లో పేరొందిన నిర్మాణ సంస్థ వార్నర్ బ్రో డిస్కవరీ ఇంక్‌తో ఒప్పందం కూడా చేసుకుంది. దీంతో అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ డిస్నీ హాట్‌స్టార్ యాప్‌లకు గట్టి పోటీ ఇవ్వనున్నది. వయాకాం18, వార్నర్ బ్రోస్ స్పందిస్తూ జియో సినిమా నుంచి వచ్చే సినిమాలు, షోలు అమెరికాలో మాత్రమే ప్రసారమవుతాయని పేర్కొంది. ఇంతకుముందు వార్నర్ బ్రోస్, హెచ్బీవో సంస్థల కంటెంట్ ప్రసార హక్కులు డిస్నీ హాట్ స్టార్ మాత్రమే ఉండేవి. వయాకాం, వార్నర్ బ్రో మధ్య గత మార్చి 31న ఒప్పందం కుదిరింది. హెచ్బీఓ పేరెంట్ బాడీ వార్నర్ బ్రోస్ తో జియో సినిమా ఒప్పందం వల్ల అమెరికాలో హెచ్బీఓ ఆధ్వర్యంలోని గేమ్స్ ఆఫ్ థ్రోన్ షోస్ ప్రసారం అయ్యేవి కావు. జియో సినిమాలో ఐపీఎల్ టోర్నీ మ్యాచ్ లను ఉచితంగా 4కే క్వాలిటీపై ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. ఐపీఎల్-2023 అధికారిక లైవ్ స్ట్రీమింగ్ పార్టనర్ జియో సినిమా. ఇందుకుముందు ఐపీఎల్ మ్యాచ్‌లు డిస్నీ హాట్‌స్టార్‌లోనే ప్రసారం అయ్యేవి. అయితే, ఐపీఎల్ మ్యాచ్ లు వీక్షించడానికి హాట్ స్టార్ సబ్ స్క్రైబ్ చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పటికైతే జియో సినిమా యాప్‌లో ఏ కార్యక్రమం వీక్షించడానికైనా ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు. జియో సినిమాను ఎంటర్‌టైన్‌మెంట్‌కు అత్యంత ప్రాముఖ్య కేంద్రంగా జియో సినిమాను తీసుకెళ్లడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని వయాకాం 18 సబ్ స్క్రిప్షన్ వీడియో ఆన్ డిమాండ్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ హెడ్ ఫర్జాద్ పాలియా చెప్పారు. క్రీడల ప్రత్యక్ష ప్రసారానికి అతిపెద్ద వేదికగా జియో కాం నిలిచింది. ఎంటర్‌టైన్‌మెంట్‌కు ప్రధాన కేంద్రంగా తీర్చి దిద్దాలన్నదే ప్రస్తుత తమ అభిమతం అని అభిప్రాయ పడ్డారు.

Post a Comment

0 Comments

Close Menu