Ad Code

ఆకట్టుకుంటున్న వన్ ప్లస్ పాడ్ !


వన్ ప్లస్ పాడ్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. దాని ఫీచర్స్, లుక్స్‌ గురించి ఇప్పటికే నెట్టింట తెగ ప్రచారం జరుగుతోంది. ఈ పాడ్ లుక్స్ పరంగా అందరినీ ఆకట్టుకుంటోంది. మీడియాటెక్ డైమన్సిటీ 9000 ప్రాసెసర్, 144 హెట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది. 11.61 ఇంచెస్ 2.8కే ఎల్సీడీ డిస్ ప్లే, 500 నిట్స్ బ్రైట్ నెస్ తో వస్తోంది. మెటల్ బాడీ, స్లిమ్ డిజైన్ ఉన్న ఈ పాడ్ ప్రీమియం లుక్ తో వస్తోంది. ఇందులో డాల్బీ విజన్ టెక్నాలజీ ఉంది. 4 క్వాడ్ స్పీకర్స్ ఉన్నాయి. ఇది ఎల్పీడీడీఆర్5 ర్యామ్ తో వస్తోంది. 8జీబీ, 12 జీబీ వేరియంట్స్ ఉన్నాయి. మెమోరీ విషయానికి వస్తే.. 128 జీబీ, 256 జీబీ ఆప్షన్స్ ఉన్నాయి. 13 ఎంపీ రేర్ కెమెరా, 8ఎంపీ ఫ్రంట్ కెమెరా, 9510 ఎంఏహెచ్ బ్యాటరీ ఫీచర్స్ ఉన్నాయి. 67 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తోంది. 50 శాతం ఛార్జింగ్ అయ్యేందుకు కేవలం 30 నిమిషాలు మాత్రమే పడుతుందని కంపెనీ తెలిపింది. కానీ 0 నుంచి 100 ఛార్జ్ అయ్యేందుకు మాత్రం గంటన్నర సమయం పడుతుందట. 8జీబీ/128జీబీ వేరియంట్‌ (రూ.37,999),12 జీబీ/256 జీబీ (రూ.39,999) వేరియంట్స్ ఉన్నాయి. వీటికి అదనంగా కీ బోర్డ్‌ కావాలంటే మరో రూ.8 వేలు ఖర్చు చేయాల్సివుంటుంది. అయితే కీ బోర్డు విడిగా కొనుగోలు చేయడంపై కస్టమర్స్ పెదవి విరుస్తున్నారు. అదే ధరలో కీ బోర్టు కూడా ఇస్తే బాగుంటుందని చెబుతున్నారు. మంచి ఆఫర్స్ ఉన్న సమయంలో యాపిల్ పాడ్ కూడా ఇంచుమించు ఇదే ధరలో వస్తుందంటూ కామెంట్ చేస్తున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu