Ad Code

కొత్త టెక్నాలజీతో అద్భుతాలు చేద్దాం !


ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మ్యాన్‌ ఉద్యోగులకు పలు సూచనలు చేశారు. రిమోట్ వర్క్ ఎర ముగిసిపోయింది.. ఇకపై అందరూ ఆఫీసులకు రావాల్సిన సమయం ఆసన్నమైంది.. ఇప్పటివరకూ ఇళ్లలో నుంచి పనిచేసింది చాలు, ఆఫీసుకు వచ్చి బుద్ధిగా పనిచేసుకోండి అంటూ కంపెనీ సీఈఓ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. కొత్త ప్రొడక్టులను రూపొందించాలంటే ఆఫీసు నుంచి పని చేయడమే బెస్ట్ మోడల్ అని సూచించారు, అయితే, రిమోట్ వర్క్ కారణంగా పనిలో గందరగోళానికి దారితీయవచ్చు. ఐరిష్-అమెరికన్ ఫిన్‌టెక్ కంపెనీ స్ట్రైప్ నిర్వహించిన సెషన్‌లో ఆల్ట్‌మాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తిగా రిమోట్‌ (వర్క్ ఫ్రమ్ హోం)కు వెళ్లడానికి టెక్నాలజీ ఇంకా అందుబాటులో లేదని ఆయన సూచించారు. చర్చలో భాగంగా ఏఐ  ప్రస్తుత పరిస్థితి, సంబంధిత ఆందోళనలు, అభివృద్ధి చెందుతున్న కార్యాలయ సంస్కృతులపై ఆయన ప్రస్తావించారు. ఫ్లెక్సిబుల్ రిమోట్ వర్క్, హైబ్రిడ్ వర్క్ లేదా పూర్తి ఆఫీస్ ఆధారిత పనిపై పెరుగుతున్న చర్చల మధ్య ఆల్ట్‌మ్యాన్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇప్పటికే అనేక గ్లోబల్ టెక్ కంపెనీలు కనీసం వారానికి రెండు లేదా మూడు సార్లు ఉద్యోగులను ఆఫీసులకు తిరిగి రావడానికి కఠినమైన విధానాలను అమలు చేశాయి. ట్రెడేషనల్ ఆఫీసు-ఆధారిత వర్క్ మోడల్ ఉత్పాదకతకు ఆటంకం కలిగిస్తుందని గణనీయమైన సంఖ్యలో ఉద్యోగులు సైతం విశ్వసిస్తున్నారు. స్టార్టప్‌ కంపెనీలు సైతం తమ ఉద్యోగులకు సలహాలు, సూచనలు ఇవ్వమని అడిగినప్పుడు.. రిమోట్ వర్క్ యుగం ఇప్పటికే ముగిసిందని ఆల్ట్‌మాన్ సూచించారు. ప్రొడక్టుల రూపకల్పనలో పూర్తి స్థాయిలో ఫలితాలను పొందాలంటే ఉద్యోగులంతా కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారాయన. రిమోట్ వర్క్ కూడా ఒక ప్రయోగం లాంటిదేనని ఆల్ట్‌మాన్ అభివర్ణించారు. ఆ యుగం ఇప్పుడు ముగిసింది. 'చాలా కాలంగా టెక్ పరిశ్రమ చేసిన చెత్త పొరపాట్లలో ఇదొకటిగా భావిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఎప్పటికీ పూర్తి రిమోట్‌గా వెళ్లలేరు. స్టార్టప్‌లు కలిసి పనిచేయాల్సిన అవసరం లేదు. క్రియేటివిటీకి ఎలాంటి నష్టం జరగదు. ఇప్పుడా రిమోట్ వర్క్ ప్రయోగం ముగిసింది. టెక్నాలజీ అందుకు తగినంతగా లేదు. ముఖ్యంగా స్టార్టప్‌లలో మాత్రమే ఎప్పటికీ పూర్తి రిమోట్‌గా ఉండగలరు' అని ఆల్ట్‌మ్యాన్‌ పేర్కొన్నారు. స్ట్రైప్ సహ-వ్యవస్థాపకుడు జాన్ కొల్లిసన్ ఆల్ట్‌మ్యాన్‌ను ఒక డ్రీమర్‌గా అభివర్ణించారు. ఆయన ఒకప్పుడు AI టెక్నాలజీ విషయంలో సందేహాస్పదంగా ఉన్నాడని, ఈ ఏఐ టెక్నాలజీతో మానవాళికి అస్తిత్వ ప్రమాదం ఉందని భావించి ఉండొచ్చునని జాన్ కొల్లిసన్ తెలిపారు. అందుకే AI టెక్నాలజీతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆల్ట్‌మ్యాన్ పేర్కొన్నారు. AI టూల్స్ మానవులను ఓడించగలవని ముందుగా అందరూ గ్రహించారని తెలిపారు. వాస్తవానికి ఇప్పుడే అసలైన ఆప్టిమైజ్ చేసే సిస్టమ్‌లు ఉన్నాయన్నారు. అవేమి ఏమి చేస్తున్నారో మనం దశలవారీగా చూసే విధంగా పని చేయవచ్చు. సాధారణ నెట్‌వర్క్‌లో ఏమి జరుగుతుందో మనం చూడలేమన్నారు.


Post a Comment

0 Comments

Close Menu