Ad Code

టాస్క్ తో హెచ్‌డీఎఫ్‌సీ ఒప్పందం !


ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందు కు తెలంగాణ ప్రభుత్వం మద్దతు ఇస్తున్న టాస్క్‌తో కలిసి పని చేయనున్నట్లు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ తెలిపింది. కొత్త గ్రాడ్యూయేట్లకు, పోస్టు గ్రాడ్యుయేట్లకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచేందుకు తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ (టాస్క్‌)తో ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించింది. ఇండియాలో ప్రైవేట్ రంగంలో అది పెద్ద బ్యాంకుగా చెప్పుకునే హెచ్‌డిఎఫ్‌సి తెలంగాణ రాష్ట్ర ఐటీఈ అండ్ సి శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్)తో ఉపాధిని ప్రొత్సహించడానికి అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీని వల్ల తెలంగాణలో టాస్క్ తో కలిసి పనిచేస్తున్న 700కు పైగా విద్యా సంస్థల నుంచి గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు హెచ్‌డిఎఫ్‌సీ బ్యాంకులో ఉద్యోగాలు కల్పించవచ్చు. హైదరాబాద్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టాస్క్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా, హెచ్‌డిఎఫ్‌సీ బ్యాంక్ టాలెంట్ అక్విజిషన్ హెడ్ రంగా సుబ్రమణియన్ ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. రంగా సుబ్రమణియన్ మాట్లాడుతూ.. కొత్తగా బ్యాంకింగ్ రంగంలోకి వస్తున్న వారిని హెడీఎఫ్సీ బ్యాంక్ ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ బ్యాంక్ కు దేశ వ్యాప్తంగా 1.70 లక్షల మంది ఉద్యోగులు ఉన్నట్లు తెలిపారు. యువతకు ఈ టాస్క్ శిక్షణతో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఈ టాస్క్ ద్వారా విద్యార్థులకు ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లు.. ఇంటర్వ్యూలకు అన్ని రకాల లాజిస్టికల్ మద్దతును అందిస్తుందన్నారు.

Post a Comment

0 Comments

Close Menu