Ad Code

గూగుల్ మెయిన్ ఆఫీస్ భవనం నుంచి దూకి ఉద్యోగి ఆత్మహత్య !


అమెరికాలోని చెల్సియాలోన గూగుల్ మెయిన్ ఆఫీస్ భవనం 14వ అంతస్థు నుంచి 31 ఏళ్ల ఉద్యోగి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు, పోలీసులు ఘటనాస్థిలికి చేరుకుని పరిశీలించారని న్యూయార్క్ పోస్ట్ తెలియజేసింది. ఆ గూగుల్ ఉద్యోగి వివరాలు, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు ? అనే విషయాలు వెల్లడించలేదు. అతని కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందిచలేదని చెప్పారు. 15 అంతస్థుల భవనంలో 14వ ఫ్లోర్ లో ఓపెన్ ఎయిర్ టెర్రస్ పైనుంచి దూకినట్లు అనుమానించి అక్కడ చెక్ చేయగా, అతని వేలిముద్రలు దొరికాయి. అక్కడి నుంచే దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారణకు వచ్చారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్న వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భవనంలో గానీ, ఘటనాస్థలంలో గానీ ఎలాంటి సూసైడ్ నోట్, వీడియో లభించలేదు. అతని ఆత్మహత్యకు అసలు కారణం ఏంటో తెలియరాలేదు. ఇటీవలే ఫిబ్రవరిలో 33 ఏళ్ల జేకబ్ ప్రాట్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అపార్టుమెంట్ లో ఉరివేసుకుని అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని లింక్ డిన్ ప్రొఫైల్ ప్రకారం గూగుల్ లో పార్ట్నర్ షిప్ లీడ్ గా పనిచేస్తున్నట్లు ఉంది. అయితే ఈ ఆత్మహత్యలకు కారణం ఏంటి? ఉద్యోగుల తొలగింపు జాబితాలో వారి పేర్లు కూడా ఉన్నాయా? అనే విషయాలపై ఎలాంటి స్పష్టత లేదు.

Post a Comment

0 Comments

Close Menu