Ad Code

వాట్సాప్‌లో బ్రాడ్‌కాస్ట్‌ చానల్‌ ?


12 కొత్త ఫీచర్లతో సహా ఆండ్రాయిడ్‌లో బ్రాడ్‌కాస్ట్‌ ఛానెల్‌ కాన్వర్జెషన్‌పై వాట్సాప్ పనిచేస్తోందని తెలిపింది. బ్రాడ్‌కాస్ట్‌ చానల్‌ ద్వారా గ్రూప్‌ తరహాలోనే సంభాషణలకు అవకాశం ఇవ్వనున్నది. వాట్సాప్‌ బీటా ఇన్ఫో ప్రకారం.. ఛానెల్‌లను వీక్షించే సామర్థ్యం అభివృద్ధి దశలో ఉంది. ఇది యాప్ భవిష్యత్తు నవీకరణలో బీటా టెస్టర్‌లకు అందుబాటులో ఉంటుంది. ఈ బ్రాడ్‌కాస్ట్‌ ఛానెల్‌లో మెసేజింగ్ ఇంటర్‌ఫేస్, వెరిఫికేషన్ స్టేటస్, ఫాలోయర్ల సంఖ్య, మ్యూట్ నోటిఫికేషన్ బటన్, హ్యాండిల్స్, రియల్ ఫాలోయర్స్ కౌంట్, షార్ట్‌కట్‌లు, ఛానెల్ వివరణ, మ్యూట్ నోటిఫికేషన్ టోగుల్, విజిబిలిటీ స్టేటస్, ప్రైవసీ మరియు రిపోర్టింగ్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. ఛానెల్‌లు విడుదలైన తర్వాత యూజర్లకు సాధ్యమైనంత ఉత్తమమైన అనుభవాన్ని అందించడానికి కంపెనీ అనేక ఛానెల్ ఫీచర్‌లను తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. దీనితో పాటు 'అడ్మిన్‌ రివ్యూ' అనే మరో ఫీచర్‌ను వాట్సాప్‌ గ్రూప్‌లలో కూడా చేర్చనుంది. దీని ద్వారా వాట్సాప్‌ గ్రూప్‌ల అడ్మిన్‌లకు పలు కొత్త ఆప్షన్లు రానున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu