Ad Code

భవిష్యత్ భారత్ విద్యుద్ధీకరణకు ఇది సంకేతం !


లిథియం రిజర్వు నిల్వలు జమ్ముకశ్మీర్‌లో ఉన్నాయని జాతీయ జియాలజికల్ సర్వే నిపుణులు తేల్చారు. కానీ, తాజాగా రాజస్థాన్ లోని డెగానాలో లిథియం నిల్వలు ఉన్నాయని తేలింది. దీనిపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. లిథియం నిల్వలను వినియోగంలోకి తేవాలంటే సప్లయ్ చైన్, రిఫైనింగ్ వసతులు ముఖ్యం అని స్పష్టం చేశారు. లిథియం నిల్వల రిఫైనింగ్ వసతుల్లో చైనా చాలా ముందు ఉందన్నారు. మన దేశంలో లిథియం నిల్వల రిఫైనింగ్ వసతుల కల్పనకు శరవేగంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 21వ శతాబ్ధిలో డెవలప్‌మెంట్‌కు మన వద్ద భారీ సహజ వనరుల నిల్వలు ఉన్నాయని అన్నారు ఆనంద్ మహీంద్రా. భవిష్యత్ భారత్ విద్యుద్ధీకరణకు ఇది సంకేతం అని అభిప్రాయ పడ్డారు. జమ్ముకశ్మీర్ లోని రేయాసీ జిల్లాలో లిథియం నిల్వలు ఉన్నాయని తేలడంతో భారత్‌కు ఉజ్వల భవిష్యత్ ఉందనడంలో సందేహం లేదన్నారు. అధికారికంగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అధికారికంగా ప్రకటన చేయకున్నా.. ఐఏఎన్ఎస్ వార్తా సంస్థ కథనం ప్రకారం రాజస్థాన్ లో గల లిథియం నిల్వలు.. ఇండియా 80 శాతం అవసరాలు తీరుస్తాయని జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు చెప్పినట్లు సమాచారం. మొబైల్ ఫోన్లు, లాప్ టాప్ లు, ఎలక్ట్రిక్ వెహికల్స్ లో చార్జబుల్ బ్యాటరీల్లో లిథియం వాడతారు.

Post a Comment

0 Comments

Close Menu