Ad Code

టాటా ప్లే బింజ్‌ మెగా సబ్ స్క్రిప్షన్ ప్లాన్ !


టాటా ప్లే బింజ్ ఓటీటీ యాప్స్ అన్నీ ఒకే చోట యూజర్లకు అందుబాటులోకి తెస్తున్నది. దేశవ్యాప్తంగా పలు భాషల్లో ఉన్న 26 ఓటీటీ యాప్స్  ఒకే వేదికపైకి తెచ్చింది. టాటా ప్లే బింజ్‌లో సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే అందులో భాగస్వాములుగా ఉన్న ఓటీటీ యాప్స్‌లో లభించే సినిమాలు, టీవీ షోలు, వెబ్ సిరీస్‌లు, స్పోర్ట్స్ ఈవెంట్లు ఒకే చోట వీక్షించడానికి సౌకర్యంగా ఉంటుంది. టాటా ప్లే బింజ్ నెలవారీ టారిఫ్ రూ.199 నుంచి మొదలవుతుంది. టాటా ప్లే డీటీహెచ్ సర్వీసు వాడుకునే వారితోపాటు ఇతరులు కూడా టాటా ప్లే బింజ్ ఓటీటీ సేవలు అందుకోవచ్చు. అందుకు టాటా ప్లే బింజ్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. టాటా ప్లే బింజ్ గతంలో పరిమితంగా ఓటీటీ యాప్స్ సేవలు అందించింది. క్రమంగా తమ యాప్ ద్వారా రకరకాల కంటెంట్ అందించే ఓటీటీ యాప్స్ సేవలు పెంచుకుంటూ వెళుతున్న టాటా ప్లే బింజ్, తాజాగా తెలుగు ప్రజలకు వినోదాన్ని అందిస్తున్న 'ఆహా' యాప్ కూడా జత చేసుకుంది. టీవీతోపాటు లాప్‌టాప్, మొబైల్ ఫోన్లలో ఎక్కడైనా ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ కంటెంట్ వీక్షించవచ్చు. టాటా ప్లే బింజ్ సెటప్ బాక్స్ ద్వారా అమెజాన్ ఫైర్ స్టిక్, ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ ప్రోగ్రామ్‌లను టీవీల్లో వీక్షించవచ్చు. ఓటీటీ యాప్స్ వారీగా సేవలపై టారిఫ్ ప్లాన్ నిర్ణయించింది టాటా ప్లే బింజ్. 26 ఓటీటీ యాప్స్ గల నెలవారీ ప్లాన్ టారిఫ్ రూ.349, 24 ఓటీటీ యాప్స్‌తో కూడిన ప్లాన్ టారిఫ్ రూ.249, 200 ఓటీటీ యాప్స్‌తో కూడిన ప్లాన్ టారిఫ్ రూ.199 గా ఖరారు చేసింది. డిస్నీ + హాట్ స్టార్, సోనీ లివ్, జీ5, సన్ నెక్ట్స్, ఆహా, ఎరోస్ నౌ, లయన్స్ గేట్, వూట్ సెలెక్ట్, ఎంఎక్స్ ప్లేయర్, హంగామా ప్లే, షీమారోమీ, ఎపిక్ ఆన్, వూట్ కిడ్స్, నమ్మా ఫ్లిక్స్, ప్లానెట్ మరాఠీ, చౌపల్, రీల్ డ్రామా, వ్రోట్, మనోరమ మాక్స్, తరంగ్ ప్లస్, కూడ్, హోయిచోయి, షార్ట్స్ టీవీ, ట్రావెల్ ఎక్స్ పీ, క్యూరియాసిటీ స్ట్రీమ్ వంటి యాప్స్ ఉన్నాయి. నెలవారీ టారిఫ్ ప్లాన్‌తోపాటు త్రైమాసికం, వార్షిక ప్లాన్ టారిఫ్ కూడా అందుబాటులో ఉన్నాయి. రూ.349 ప్లాన్ టారిఫ్.. త్రైమాసికానికి రూ.989.. వార్షిక ప్లాన్ కింద రూ.3839 పే చేయాల్సి ఉంటుంది. అయితే, ఇంకా అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ వంటి ప్రముఖ ఓటీటీ యాప్స్ మాత్రం అందుబాటులో లేవు.

Post a Comment

0 Comments

Close Menu