Ad Code

మైక్రో ఎల్ఇడి డిస్‌ప్లేతో రానున్న యాపిల్ వాచ్


మైక్రో ఎల్‌ఇడి టెక్నాలజీ డెవలప్‌మెంట్‌పై యాపిల్‌ కంపెనీ దృష్టి సారించింది. మైక్రో ఎల్‌ఇడి డిస్‌ప్లేల విషయంలో ఎక్కువ ఖర్చులు, ఇతర సవాళ్లు ఉన్నప్పటికీ, ఈ కొత్త టెక్నాలజీతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ యాపిల్ ఫ్యూచర్‌ ప్రొడక్టులకు సంబంధించి విలువైన ఇన్వెస్ట్‌మెంట్‌గా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. యాపిల్ కంపెనీ నెక్స్ట్ జనరేషన్‌ డిస్‌ప్లే టెక్నాలజీ మైక్రో ఎల్‌ఇడిని డెవలప్ చేసే పనుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ టెక్నాలజీని ఫ్యూచర్‌లో రాబోతున్న యాపిల్ ప్రొడక్టుల్లో వినియోగిస్తుందని భావిస్తున్నారు. కొన్ని నివేదికల ప్రకారం.. 2025లో లాంచ్‌ కానున్న యాపిల్‌ వాచ్ అల్ట్రా ఈ కొత్త డిస్‌ప్లే టెక్నాలజీతో వస్తుంది. ప్రస్తుతం యాపిల్‌ వాచ్ అల్ట్రా OLED టెక్నాలజీని ఉపయోగిస్తోంది. మైక్రో ఎల్ఇడి ద్వారా బ్రైట్నెస్‌, కలర్స్‌, లాంగర్‌ పొటెన్షియల్ లైఫ్‌టైమ్‌ విభాగాల్లో ఇంప్రూవ్‌మెంట్ కనిపించనుంది. ఇండివిడ్యువల్‌ పిక్సెల్స్‌ కోసం మైక్రో ఎల్ఇడి డిస్‌ప్లేలను మైక్రోస్కోపిక్ ఎల్‌ఇడిల ద్వారా క్రియేట్‌ చేస్తారు. ఇది వాటిని మరింత ఎనర్జీ- ఎఫిషియంట్‌గా చేస్తుంది. స్క్రీన్ బర్న్-ఇన్‌కు తక్కువ అవకాశం ఉంటుంది. అయినప్పటికీ మైక్రోఎల్‌ఇడి అనేది భారీ-ఉత్పత్తికి సవాలు చేసే టెక్నాలజీ, అధిక ఉత్పత్తి వ్యయంతో వస్తుంది. ఈ సవాళ్లను ఎలా అధిగమించాలనే అంశంపై ఇప్పటికే అనేక కంపెనీలు పనిచేస్తున్నాయి. మైక్రోఎల్‌ఇడి డిస్‌ప్లేలు ఇతర టెక్నాలజీలపై అనేక ప్రయోజనాలను అందిస్తాయి. పిక్సెల్-లెవల్‌ ఇండివిడ్యువల్ లైట్స్‌ కారణంగా కాంట్రాస్ట్ ఇంప్రూవ్‌మెంట్స్‌, ఫాస్టెర్‌ రెస్పాన్స్‌ టైమ్‌, అలాగే బెటర్‌ బ్రైటెర్‌ కలర్స్‌ సాధ్యమవుతాయి. అంతేకాకుండా మైక్రోఎల్‌ఇడి డిస్‌ప్లేలు ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి. ఫోల్డబుల్ లేదా కర్వ్డ్ డిస్‌ప్లేలలో ఉపయోగించడానికి అనుకూలంగా ఉంటుంది.

Post a Comment

0 Comments

Close Menu