Ad Code

గూగుల్లో ఉపయోగకరమైన సీక్రెట్ టూల్స్ !

గూగుల్ మనిషి జీవితంలో ఒక భాగంగా ఎదిగిపోయింది. చాట్ జీపీటీ లాంటి ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్ కు పోటీగా సొంత ఏఐ టూల్ బార్డ్ ను రూపొందించింది. గుగూల్ ప్రపంచంలోనే మోస్ట్ పవర్ ఫుల్ సెర్చ్ ఇంజిన్ అని, దీన్ని సరిగ్గా వినియోగిస్తే తిరుగుండదని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అన్నారు. గూగుల్ లో ఏదైనా కావాలంటే సింపుల్ గా దాని గురించి సెర్చ్ చేస్తారు. అయితే, సెర్చ్ చేసిన కంటెంట్ గురించి గూగుల్ కచ్చితమైన సమాచారాన్ని ఇస్తుందా ? అంటే చాలా మంది 'నో' అని సమాధానం ఇస్తారు. ఎందుకంటే అందులో యాడ్స్, రిలేటెడ్ కంటెంట్, ప్రమోటెడ్ కంటెంట్ ఎక్కువ వస్తుంటుంది. 99 శాతం మందికి తెలియని గూగుల్ టిప్స్ తో ఈజీ లైఫ్ స్టైల్ ను పొందొచ్చు. అప్పుడప్పుడు గూగుల్ లో సెర్చ్ చేసింది కాకుండా అనవసర కంటెంట్ వస్తుంటుంది. వాటిని తొలగించాలంటే.. సెర్చ్ బార్ లో సెర్చింగ్ కంటెంట్ తో పాటు '-'(మైనస్) సింబల్ ని యాడ్ చేసి సెర్చ్ చేయాలి. గూగుల్ క్రోమ్ లో ఓపెన్ చేసి పెట్టుకున్న ట్యాబ్ పొరపాటున క్లోజ్ అయితే హిస్టరీకి వెళ్లి మళ్లీ ఓపెన్ చేయాల్సిన పనిలేదు. సింపుల్ గా 'కంట్రోల్+ షిష్ట్+ టి'ట్యాబ్స్ క్లిక్ చేయాలి. ఎక్సాక్ట్ కంటెంట్ కోసం వెతుకుతున్నట్లయితే సెర్చ్ చేసేముందు కంటెంట్ కు కొటేషన్స్ యాడ్ చేయాలి. అంతేకాకుండా సెర్చ్ చేసిన దాని రిలేటెడ్ కంటెంట్ కావాలంటే () సింబల్ తో సెర్చ్ చేయాలి. అంటే మ్యూజిక్ క్లాస్ ల గురించి కంటెంట్ కావాలంటే మ్యూజిక్ క్లాసెస్ అని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన కంటెంట్ ను కావాల్సిన ఫైల్ టైప్ లో కూడా గూగుల్ నుంచి పొందొచ్చు. అంటే ఏదైనా విషయం గురించి సెర్చ్ చేస్తే దాంతో పాటు పీడీఎఫ్ కావాలంటే పీడీఎఫ్ అని సెర్చ్ చేయాలి. ఏదైనా వ్యక్తి లొకేషన్  దాని వివరాలు కావాలంటే.. 'అతని పేరు : లొకేషన్'అని సెర్చ్ చేయాలి. ప్రయివేట్ బ్రౌజింగ్ అంటే హిస్టరీ సేవ్ కాకుండా కంటెంట్ సెర్చ్ చేయాలంటే.. 'కంట్రోల్ + షిఫ్ట్+ ఎన్'చేయాలి.

Post a Comment

0 Comments

Close Menu