Ad Code

సుందర్ పిచాయ్ శాలరీ పేచెక్‌పై పేలుతున్న మీమ్స్‌ !


గూగుల్ అధిక జీతం పొందే సీఈఓ సుందర్ పిచాయ్ వేతనాల్లో కోత పెట్టలేదు. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ కి సుందర్ సీఈఓగా కొనసాగుతున్నారు. లేఆఫ్స్, ఎంప్లాయ్ ప్రయోజనాల తగ్గింపులు కొనసాగుతున్నా ఈయన భారీ ఎత్తున శాలరీ తీసుకుంటున్నారు. దాంతో పొదుపు చర్యలు అంటూ ఉద్యోగులను తొలగిస్తుంటే సుందర్ ఆ స్థాయిలో డబ్బులు పొందడం ఏంటని గూగుల్ ఉద్యోగులు విమర్శలు చేస్తున్నారు. సుందర్ పేచెక్‌పై మీమ్స్ క్రియేట్‌ చేస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు అంటూ ఉద్యోగులను తీసేస్తున్నప్పుడు పిచాయ్ మాత్రం పెద్ద మొత్తంలో జీతం పొందడం అన్యాయమని గూగుల్ ఉద్యోగులు వ్యాఖ్యలు చేస్తున్నారు. సుందర్ పిచాయ్ 2022లో దాదాపు $226 మిలియన్లను (దాదాపు రూ.22.6 కోట్లు) సంపాదించారు. ఇది ఒక ఉద్యోగి సగటు వేతనం కంటే 800 రెట్లు ఎక్కువ. ఈ వేతన వ్యత్యాసం గూగుల్ వర్కర్స్‌కి కోపం తెప్పించింది. కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలను తొలగిస్తోన్న పరిస్థితులలో వారి కోపం మరింత పెరిగింది. జనవరిలో గూగుల్ 12,000 ఉద్యోగాలను తగ్గించే ప్రణాళికలను ప్రకటించింది. ఇది దాని వర్క్‌ఫోర్స్‌లో 6%కి సమానం. పిచాయ్ శాలరీ, బోనస్‌తో సహా ఇతర ప్రయోజనాల ద్వారా పెద్ద మొత్తంలో పరిహారం పొందినట్లు ఇటీవల వెల్లడయ్యింది. ఈ విషయం తెలిసిన గూగుల్ ఉద్యోగులు కంపెనీ ఇంటర్నల్ ప్లాట్‌ఫామ్‌లపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. వారి పోస్ట్‌లలో కొన్ని బయటకు వచ్చాయి. వాటిలో పిచాయ్‌ని యాపిల్ సీఈఓ అయిన టిమ్ కుక్‌తో పోల్చిన మీమ్స్ ఉన్నాయి. కుక్ గత సంవత్సరం తన మొత్తం పరిహారంలో 40% కోత విధించుకున్నారు. ఇది, సుందర్ పిచాయ్ 226 మిలియన్ డాలర్ల పేచెక్కు వారి మీమ్ పోస్ట్‌లలో హైలైట్ అయ్యాయి. మొత్తం మీద కంపెనీ ఖర్చులను తగ్గించుకుంటున్నప్పటికీ సీఈఓ సుందర్ పిచాయ్ వేతనాన్ని పెంచడంపై గూగుల్ ఉద్యోగులు నిరాశను వ్యక్తం చేశారు.

Post a Comment

0 Comments

Close Menu