Ad Code

నెట్ ఫ్లిక్స్ పై ఆదాయ పన్ను?

నెట్‌ఫ్లిక్స్‌ కు ఐటీ శాఖ పన్ను విధించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దేశంలో స్ట్రీమింగ్ సర్వీసుల ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను వేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఒక వేళ ఇదే జరిగితే విదేశీ డిజిటల్ కంపెనీలపై పన్ను విధించడం ఇదే తొలిసారి అవుతుంది. కొన్ని రిపోర్టుల ఆధారంగా ఈ వార్తలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ అంశంపై ఇటు ప్రభుత్వం గానీ, నెట్ ఫ్లిక్స్ గానీ అధికారిక ప్రకటన చేయలేదు. భారత్ లో ఎలక్ట్రానిక్స్ కామర్స్ సర్వీసెస్ అందించే కంపెనీల్లో నెట్ ఫ్లిక్స్ ఈ ట్యాక్స్ ఎదుర్కొనే అవకాశముంది. ప్రపంచంలోనే పాపులర్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లో ఒకటైన నెట్ ఫిక్స్ కు భారత్ లో కూడా పెద్ద ఎత్తున యూజర్లు ఉన్నారు. దీంతో ఆదాయం కూడా అంతే వస్తోంది. 2021-22 అసెస్‌మెంట్‌ ఏడాదికి గాను భారత్‌లో నెట్‌ఫ్లిక్స్‌కు సుమారు రూ. 55 కోట్ల ఆదాయం వచ్చినట్టు కేంద్ర ఆదాయ పన్ను విభాగం అంచనా వేసింది. దిగ్గజైన ఓటీటీ అయిన నెట్ ఫ్లిక్స్ తమ స్ట్రీమింగ్‌ కార్యకలాపాలను భారత్‌లో కొనసాగించేందుకు అమెరికాలోని హెడ్ ఆఫీస్ నుంచి తాత్కాలికంగా ఉద్యోగులను ఉపయోగించుకుంటోంది. అదే విధంగా మౌలిక వసతులను సైతం వాడుకుంటోంది. దీంతో భారత్‌లో నెట్‌ఫ్లిక్స్‌ పర్మినెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ కిందకు వస్తుందనేది పన్ను విభాగానికి చెందిన అధికారులు పేర్కొన్నారు. భారత్ నిబంధనల ప్రకారం.. ఈ పీఈ లన్నీ పన్ను చెల్లించాలని స్పష్టం చేశారు. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థను నియంత్రించేందుకు విదేశీ కంపెనీలు భారత్‌లో ఆర్జించే ఆదాయంపై పన్ను విధించాలని కేంద్రం కొంతకాలంగా ఆలోచిస్తోంది. ఈ క్రమంలోనే డిజిటల్‌ పన్ను తాజాగా తెరపైకి వచ్చింది. భారత్ 2016 లోనెట్ ఫ్లిక్స్ సర్వీసులు స్టార్ట్ అయ్యాయి. ప్రస్తుతం ఇండియాలో ఈ ఓటీటీకి దాదాపు 60 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు. ప్రతి ఏటా ఇండియాలో స్ట్రీమింగ్ అవర్స్ 30 శాతం మేర పెరుగుతున్నాయని నెట్ ఫ్లిక్స్ కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్ గిల్ గతంలో వ్యాఖ్యలు చేశారు. నెట్ ఫ్లిక్స్ కి భారత్ కీలకమైన మార్కెట్ గా మారింది. అంతర్జాతీయంగా చూస్తే 2022 లో నెట్ ఫ్లిక్స్ కు భారత్ నుంచే ఎక్కువ మంది సబ్ స్క్రైబర్స్ ఉన్నారు.

Post a Comment

0 Comments

Close Menu