Ad Code

గూగుల్ పాస్ వర్డ్ స్థానంలో పాస్ కీస్ !


గూగుల్ పాస్ వర్డ్ స్థానంలో పాస్ కీస్ ని తీసుకొస్తుంది. యాప్స్ లో లాగిన్ అవ్వాలి అంటే ఇప్పుడు పాస్ వర్డ్ గా అంకెలను పెడుతున్నాం. కొన్ని యాప్స్ కి 4 అంకెలు, ఇంకొన్ని యాప్స్ కి 6 అంకెలు ఉంటాయి. వాటిని పాస్ వర్డ్ అంటారు. కానీ, వాటి స్థానంలో పాస్ కీస్ ని తీసుకురానున్నారు. పాస్ కీస్ తో 123 వంటి పాస్ వర్డ్ లకు గుడ్ బై చెప్పనున్నారు. పాస్ కీస్ అంటే ఫేస్ ఐడీ, ఫింగర్ ప్రింట్ ఆదారిత బయోమెట్రిక్ అనమాట. వీటి సాయంతో మీరు పాస్ వర్డ్ లేకుండా యాప్స్ లో లాగిన్ అవ్వచ్చు. ఈ టెక్నాలజీ ఆలోచన మొదట 2009లో వచ్చింది. పాస్ వర్డ్ బదులు ఇలా పాస్ కీస్ వినియోగిస్తే బాగుంటుంది కదా అనుకున్నారు. 2012లో ఇంటర్నేషనల్ పేమెంట్స్ సంస్థ పేపాల్ కి చెందిన దిగ్గజ టెక్ కంపెనీలతో కలిసి పాస్ వర్డ్స్ స్థానంలో బయోమెట్రిక్ వినియోగించేలా ఒక ఒప్పందానికి వచ్చారు. జులై 2012లో ఫిడో (ఫాస్ట్ ఐడెంటీ ఆన్ లైన్) పేరుతో సంస్థను స్థాపించారు. 2013వ సంవత్సరంలో గూగుల్ సంస్థ సైతం ఈ ఫిడో చేరింది. 2014లో పేపాల్- శాంసంగ్ కలిసి అథంటికేషన్ ను శాంసంగ్ గెలాక్సీ ఎస్ 5 ఫోన్ లో ఎనేబుల్ చేశారు. తాజాగా పాస్ కీస్ ప్రయోగాలను గూగుల్ మరింతగా పెంచింది. యాపిల్, మైక్రోసాఫ్ట్ సంస్థలు కూడా ఫిడోలో భాగస్వాములుగా ఉన్నారు. ఇప్పుడు వారితో కలిసి గూగుల్ పనిచేస్తోంది. వచ్చే సంవత్సరం మే 2న ప్రపంచ పాస్ వర్డ్ డేసందర్భంగా ఈ పాస్ కీస్ ఆప్షన్ ని ప్రవేశపెట్టే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu