Ad Code

ట్విన్-సిలిండర్ సీఎన్జీ తో టాటా ఆల్ట్రోజ్ కారు !


దేశీయ మార్కెట్లో టాటా మోటార్స్ ఆల్ట్రోజ్  ఐసీఎన్జీ కారును రూ. 7.55 లక్షల (ఎక్స్-షోరూమ్)తో లాంచ్ చేసింది. భారత మార్కెట్లో హ్యాచ్‌బ్యాక్ ట్విన్-సిలిండర్  సీఎన్జీ సిస్టమ్‌తో వచ్చిన ఫస్ట్ మోడల్ కారు ఇదే. ఇందులో బూట్ స్పేస్‌ను అనుమతిస్తుంది. టియాగో, టిగోర్ తర్వాత టాటా నుంచి థర్డ్  సీఎన్జీ మోడల్ అని చెప్పవచ్చు. ఈ కారు లాంచ్‌పై టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్, టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర మాట్లాడుతూ  వినియోగదారులు ఆర్థిక, పర్యావరణ అనుకూల డ్రైవ్ వంటి ఫ్యూయల్ ఆప్షన్లను ఎక్కువగా వినియోగిస్తున్నారని చెప్పారు. సీఎన్జీ విస్తృత లభ్యత, యాక్సెసిబిలిటీతో కూడిన ఇంధనానికి ఎక్కుడ డిమాండ్ పెరిగింది.  సీఎన్జీ వంటి ఫీచర్లపై బూట్ స్పేస్‌ను అందిస్తున్నాయి. జనవరి 2022లో అధునాతన  ఐసీఎన్జీ టెక్నాలజీతో వచ్చింది. టిగోర్ మోడల్ కారు అత్యుత్తమ పనితీరు, టాప్-ఎండ్ ఫీచర్‌లను అందిస్తోంది. ఆల్ట్రోజ్ ని భారత మార్కెట్లో లాంచ్ చేయడం పట్ల చాలా సంతోషంగా ఉందని శైలేష్ చంద్ర పేర్కొన్నారు. బూట్ స్పేస్‌ సమస్యను పరిష్కరించడం ద్వారా సీఎన్జీ మార్కెట్‌ను మరింత విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. ఫీచర్ల విషయానికొస్తే.. ఈ కారులో వాయిస్-ఆపరేటెడ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, స్మార్ట్‌ఫోన్ వైర్‌లెస్ ఛార్జర్, ఎయిర్ ప్యూరిఫైయర్, 8-స్పీకర్ హర్మాన్ ఆడియో సిస్టమ్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసీ వంటి మరెన్నో ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. టాటా ఆల్ట్రోజ్ ఐ సీఎన్జీ  1.2-లీటర్ ఇంజన్‌తో వస్తుంది. 73.5bhp, 103Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వచ్చింది. టాటా ఆల్ట్రోజ్ ​​ట్విన్-సిలిండర్ సీఎన్జీ సెటప్‌తో వస్తుంది. బూట్ స్పేస్ కింద ఉంటుంది. ఒకే పెద్ద సిలిండర్‌కు బదులుగా రెండు చిన్న సిలిండర్‌లను అందిస్తుంది. అందువల్ల బూట్ స్పేస్ మరింత ఎక్కువగా ఉంటుంది. అదే సింగిల్ సిలిండర్‌ కార్లతో పోలిస్తే బూట్ స్పేస్‌ ఎక్కువగా ఉంటుంది. కారు ప్యూయల్ నింపే సమయంలో కారును ఆపివేసే మైక్రో-స్విచ్‌ను కూడా అందిస్తుంది. థర్మల్ ఇన్‌సిడెంట్ ప్రొటెక్షన్ ఇంజన్‌కి సీఎన్జీ సరఫరాను నిలిపివేస్తుంది. సెక్యూరిటీ కొలమానంగా గ్యాస్‌ను బయటికి రిలీజ్ చేస్తుంది. ఈ కారులోని ట్యాంకులు 6 పాయింట్లతో మౌంట్ కాగా, ప్రత్యేకించి క్రాష్ సెక్యూరిటీని అందిస్తుంది. ఏదైనా ప్రమాదానికి ముందుగా అలర్ట్ చేస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu