Ad Code

వాట్సాప్ స్టేటస్‌ను ఫేస్‌బుక్‌లో షేర్ చేయవచ్చు !


వాట్సాప్ స్టేటస్ ఫీచర్‌ను కొంత కాలం క్రితం పరిచయం చేసింది. స్టేటస్‌లో పెట్టే అప్‌డేట్స్‌ను ఇతర యాప్స్‌కు షేర్ చేసుకునేలా మరో ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ఫేస్‌బుక్‌కి కూడా వాట్సాప్ స్టేటస్‌లను ఈజీగా షేర్ చేయవచ్చు. ఎఫ్‌బీ న్యూస్‌ ఫీడ్, గ్రూప్స్ లేదా స్టోరీలో దీన్ని పోస్ట్ చేసే ఆప్షన్ ఉంది. లేదంటే దాన్ని ప్రొఫైల్ పిక్‌గా కూడా సెట్ చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ ఓపెన్ చేసి, స్టేటస్ ట్యాబ్‌కి వెళ్లాలి. ఫేస్‌బుక్‌లో షేర్ చేయాలనుకుంటున్న స్టేటస్ అప్‌డేట్‌ను సెలక్ట్ చేసుకోవడానికి "My Status" ఆప్షన్‌పై నొక్కాలి. అప్పుడు స్టేటస్ అప్‌డేట్స్‌ అన్ని కనిపిస్తాయి. ఫేస్‌బుక్‌కి షేర్ చేయదలుచుకున్న స్టేటస్ పక్కన కనిపించే త్రీ డాట్స్ ఐకాన్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు ఫార్వర్డ్, షేర్, షేర్ టు ఫేస్‌బుక్‌, డిలీట్ వంటి ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో షేర్ లేదా షేర్ టు ఫేస్‌బుక్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. షేర్ టు ఫేస్‌బుక్ ఆప్షన్‌పై క్లిక్ చేసి ద్వారా నేరుగా ఫేస్‌బుక్ స్టోరీస్‌లో వాట్సాప్ స్టేటస్‌ని పోస్ట్ చేయవచ్చు. ఈ సమయంలో స్టేటస్‌ను షేర్ చేయడానికి అలో చేయమని, లేదంటే ఫేస్‌బుక్ యాప్ ఓపెన్ చేయమని అడుగుతుంది. అందుకు ఓకేపై క్లిక్ చేయాలి. స్టేటస్‌ను షేర్ చేసే ఫేస్‌బుక్‌లోని ఎవరెవరికి దానిని షేర్ చేయాలో సెలక్ట్ చేసుకోవచ్చు. అంతేకాదు స్టేటస్‌కి క్యాప్షన్ యాడ్ చేయవచ్చు, దాన్ని ఎడిట్ కూడా చేయవచ్చు. కొత్తగా వాట్సాప్ స్టేటస్ క్రియేట్ చేస్తే దానికిందే షేర్ టు ఫేస్‌బుక్ స్టోరీ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయడం ద్వారా దానిని ఈజీగా ఎఫ్‌బీకి షేర్ చేయవచ్చు. ఫేస్‌బుక్‌కి వాట్సాప్ స్టేటస్ అప్‌డేట్‌ను షేర్ చేయడం అనేది ఎక్కువమందిని చేరుకోవడానికి, ఆలోచనలు లేదా అనుభవాలను సోషల్ నెట్‌వర్క్‌తో పంచుకోవడానికి గొప్ప మార్గం. ఇది ఎలాంటి అదనపు టూల్స్ లేదా యాప్‌ల అవసరం లేకుండా నేరుగా వాట్సాప్ యాప్ నుంచి షేర్ చేయగలిగే వేగమైన, సులభమైన ప్రక్రియ. వాట్సాప్ స్టేటస్ అప్‌డేట్‌ను ఫేస్‌బుక్‌కి షేర్ చేసినప్పుడు, ఆ పోస్ట్ ఫేస్‌బుక్ స్నేహితులు, ఫాలోవర్లకు కనిపిస్తుంది. కానీ ఫేస్‌బుక్ స్నేహితులు కాని మీ వాట్సాప్ పరిచయాలకు కనిపించదు.

Post a Comment

0 Comments

Close Menu