ఆజ్‌తక్ న్యూస్ చానల్ సరికొత్తగా దేశంలోనే మొదటిసారిగా ఏఐ యాంకర్‌ను ప్రవేశపెట్టింది. ఏఐ టెక్నాలజీతో పనిచేసే దీని పేరు సనా. సనా న్యూస్ చదువుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దాని విశేషాలను ఇండియాటుడే వైస్ చెర్‌పర్సన్ కాలిపూరీ వివరించారు. వయసు మీదపడని, అలసట తెలియని, తడబడని, బహుళ భాషలను మాట్లాడే యాంకర్‌ను టీవీ రంగంలోకి ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు. గూగుల్ టెక్స్‌టు-స్పీచ్ ఇంజిన్ ను ఉపయోగించి సనా పని చేస్తుంది. స్మార్ట్‌ఫోన్లలో ఉండే ఫీచర్‌కు ఇది అప్‌డేట్ వెర్షన్ గా చెప్పవచ్చు. 2018లో చైనాలోనూ ఇటువంటి యాంకర్‌ను తీసుకొచ్చారు. బహుళ భాషలు మాట్లాడే హ్యూమనాయిడ్ రోబో రూపమే సనా.
0 Comments