Ad Code

వెయ్యి మంది ఉద్యోగుల్ని తొలగించనున్న రిలయన్స్ జియోమార్ట్‌


రిలయన్స్ జియోమార్ట్‌ వెయ్యి మంది ఉద్యోగులపై వేటు వేసింది. లాభాలపై దృష్టి పెట్టిన ఆ కంపెనీ భారీ లే ఆఫ్స్‌కు సిద్దమైంది. రానున్న రోజుల్లో మరో 9 వేల మంది ఉద్యోగుల్ని కూడా జియోమార్ట్ తొలగించనున్నది. రిటైల్ రంగంలో పాపులర్ అయిన జియోమార్ట్ ఇక నుంచి లాభాలపై దృష్టి పెట్టాలని భావిస్తోంది. ఉద్యోగులు రిజైన్ చేయాలని కంపెనీ ఆదేశించినట్లు ఓ వార్తా కథనం పేర్కొన్నది. కార్పొరేట్ ఆఫీసుల్లో ఉన్న 500 మంది ఎగ్జిక్యూటివ్‌లను కూడా తొలగిస్తున్నట్లు సమాచారం. లాభాల ఆర్జనపై దృష్టి పెట్టిన జియోమార్ట్ తన ప్రణాళికల్ని మార్చుకున్నది. అయితే తమ కంపెనీకి చెందిన సగం సెంటర్లను మూసివేందుకు జియోమార్ట్ సిద్దమైంది. లోకల్ స్టోర్లకు ఉత్పత్తుల్ని సరఫరా చేసే సెంటర్లను మూసివేయాలని జియోమార్ట్ భావిస్తోంది. ఇటీవల రిలయన్స్ డిజిటల్ సంస్థ .. జర్మనీకి చెందిన మెట్రో ఏజీ కంపెనీతో డీల్ కుదుర్చుకున్నది. 344 మిలియన్ల డాలర్ల ఆ డీల్ వల్ల కూడా జియోమార్ట్ కొన్ని మార్పులు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

Post a Comment

0 Comments

Close Menu