Ad Code

ట్విట్టర్ లో వాట్సాప్ తరహా సేవలు ?


యాప్‌ వాట్సాప్‌ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాట్సాప్‌ వల్ల యూజర్‌ వ్యక్తిగత సమాచారానికి భద్రత లేదంటూ నెట్టింట నెగెటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకు కారణం ట్విట్టర్‌ ఉద్యోగి ఒకరు చేసిన ఆరోపణలే. నిద్రపోతున్న సమయంలో వాట్సాప్‌ మైక్రో ఫోన్‌ వినియోగిస్తున్నట్లు స్క్రీన్ షాట్ షేర్‌ చేశాడు. నేను ఉదయాన్నే లేవగానే నా ఫోన్ లో వాట్సాప్‌ యాక్టివిటీ చూసి ఆశ్చర్యపోయాను అంటూ ట్వీట్ చేశాడు. అయితే దానిని ట్విట్టర్‌ అధినేత ఎలన్ మస్క్‌ రీట్వీట్‌ చేయడంతో వివాదం మరింత ముదిరింది. పైగా వాట్సాప్‌ నమ్మదగిన యాప్‌ కాదంటూ మస్క్‌ స్టేట్మెంట్‌ కాడా ఇచ్చారు. నిజానికి వాట్సాప్‌ భద్రత విషయంలో ఆరోపణలు రావడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. గతంలో కూడా వాట్సాప్‌ వ్యక్తిగత గోప్యతపై అనుమానాలు వచ్చాయి. తాజాగా ఎలన్‌ మస్క్‌ రంగంలోకి దిగడంతో ఇప్పుడు నెట్టింట వాట్సాప్‌ గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ఈ విషయంపై వాట్సాప్‌ సంస్థ కూడా స్పందించింది. అది కేవలం ఒక బగ్‌ అంటూ వ్యవహారాన్ని తోసిపుచ్చింది. అంతేకాకుండా అది ఫోన్లలో సాధారణంగా జరిగే ప్రక్రియ అంటూ చెప్పుకొచ్చింది. ఆ యూజర్ వాడుతోంది గూగుల్ పిక్సల్‌ ఫోన్ అని.. ఈ విషయంపై విచారణ జరపాలని గూగుల్ ని కోరినట్లు వెల్లడించారు. కేవలం ఆడియో, వీడియో కాల్స్ మాట్లాడే సమయంలోనే వాట్సాప్‌ మైక్రో ఫోన్‌ ని ఉపయోగిస్తుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎలన్ మస్క్‌ మరో సంచలన ప్రకటన చేశారు. అదేంటంటే ట్విట్టర్‌ లోనే మీరు వాట్సాప్‌ తరహా సేవలను పొందచ్చని వెల్లడించారు. త్వరలోనే ఆ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. మీరు నేరుగా మెసేజ్‌ చేసుకోవడం, ఏమోజీలతో సమాధానం చెప్పడం చేయచ్చు. పైగా ట్విట్టర్‌ ద్వారా మీ మొబైల్‌ నంబర్ తెలియకుండానే ప్రపంచంలో ఎక్కడికైనా ఆడియో, వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చని వెల్లడించారు. త్వరలోనే టోటల్‌ ఎన్ క్రిప్షన్‌ సెక్యూరిటీతో డైరెక్ట్‌ మెసేజ్ వర్షన్‌ 1.0ని తీసుకురాబోతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఎలన్ మస్క్ చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. నిజంగానే ట్విట్టర్‌ ఇలాంటి సేవలు అందబాటులోకి వస్తే వాట్సాప్‌ కి పెద్ద దెబ్బ అవుతుందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Post a Comment

0 Comments

Close Menu