Ad Code

ట్విట్టర్ పోటీగా మెటా నుంచి మరో యాప్ ?


ట్విట్టర్ కు పోటీగా మెటా మరో యాప్ తేనున్నది. వచ్చే నెలాఖరులోగా ఇన్ స్టా వేదికగా ఆ యాప్ అందుబాటులోకి రానున్నదని సమాచారం. కొన్ని నెలలుగా మార్క్ జుకర్ బర్గ్ సారధ్యంలోని మెటా సెలెక్టెడ్ సెలబ్రిటీలు, క్రియేటర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్లతో ప్రయోగాత్మకంగా ఈ యాప్'ను పరీక్షిస్తున్నది. తొలుత టెక్ట్స్ ఆధారిత యాప్‌గా రానున్నది. అటుపై వీడియోలు, ఫొటోలు కూడా అప్ లోడ్ చేయవచ్చునని తెలుస్తున్నది. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్లు కూడా వెలుగు చూశాయి. ఇప్పటికైతే అధికారికంగా ఈ యాప్‌కు మెటా పేరు పెట్టలేదు. అయితే `పీ92`, `బార్సిలోనా` అనే ఇంటర్నల్ పేర్లతో పిలుస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల ఖాతాలతో కనెక్ట్ కావడానికి మెటా వెసులుబాటు కల్పించనున్నట్లు సమాచారం. వచ్చే నెలలోనే ట్విట్టర్‌కు పోటీ యాప్ యూజర్లకు అందుబాటులోకి వస్తుందని వినికిడి. మెటా రూపొందించిన మైక్రో బ్లాగింగ్ సైట్ యాప్‌.. ఇన్‌స్టాగ్రామ్‌ను పోలి ఉంతుందని సమాచారం. ఫొటోలు, వీడియోలతో కూడిన ఫీడ్‌కు బదులు టెక్ట్స్ ఆధారిత టైమ్ లైన్ పోస్ట్‌లు కనిపించవచ్చు. ట్విట్టర్‌నే పోలి ఉండటంతోపాటు 500 అక్షరాల వరకు టెక్ట్స్ రాసుకోవడం, ఫొటోలు, వీడియోలను జత చేయడానికి చోటు కల్పిస్తారని తెలియవచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు ఒక్కసారి క్లిక్ చేస్తే కొత్త యాప్‌లోనూ ఫాలో అయ్యేలా మెటా ఏర్పాట్లు చేస్తున్నదని సమాచారం. ట్విట్టర్ పాలసీ పరమైన నిబంధనల్లో మార్పులు రుచించని వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆల్టర్నేటివ్ ప్లాట్ ఫామ్స్ వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ సంస్థకు పోటీగా మాస్టో డాన్, ట్విట్టర్ మాజీ ఫౌండర్ జాక్ డోర్సీ బ్లూ స్కై తెచ్చారు.

Post a Comment

0 Comments

Close Menu