Ad Code

వాట్సాప్‌ గోప్యత ఉల్లంఘనపై విచారణకు కేంద్ర ఐటీ శాఖ ఆదేశం


వాట్సాప్‌ యాప్‌ వాడకంలో లేనప్పుడు కూడా వినియోగదారుల అనుమతి లేకుండా ఫోన్‌లో మైక్రోఫోన్‌ను సంస్థ యాక్సెస్‌ చేస్తోందన్న ఆరోపణలను కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. 'నేను ఫోన్‌ వాడకున్నా సరే వాట్సాప్‌ యాప్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో నా మొబైల్‌ మైక్రోఫోన్‌ను వాడుతోంది. నిద్రపోయి ఉదయం ఆరింటికి లేచా. అప్పుడూ మైక్రోఫోన్‌ దుర్వినియోగం అవుతోంది. అసలేం జరుగుతోంది?' అంటూ ఇంజనీరింగ్‌ డైరెక్టర్‌ ఫోడ్‌ డబిరి శనివారం ట్వీట్‌చేశారు. దీనికి 6.5 కోట్ల వ్యూస్‌ వచ్చాయి. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ స్పష్టం చేశారు. చారు. ''ఇది గోప్యతపై దాడి. దీనిపై వెంటనే విచారణ జరిపిస్తాం. గోప్యతకు భంగం వాటిల్లినట్లు తేలితే చర్యలు తప్పవు' అంటూ బుధవారం ట్వీట్‌ చేశారు. కొన్ని నివేదికల ప్రకారం వాట్సాప్‌ యాప్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో మైక్రోఫోన్‌ను యాక్సెస్‌ చేస్తోంది. ట్విట్టర్‌ అధినేత ఎలన్‌ మస్క్‌ కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. మైక్రోఫోన్, కెమెరా వంటి ప్రైవసీ సూచికలను ఏదైనా యాప్‌ యాక్సెస్‌ చేసినప్పుడు స్మార్ట్‌ఫోన్‌లో గ్రీన్‌ నోటిఫికేషన్‌ వినియోగదారుడికి హెచ్చరికగా పనిచేస్తుంది. ఈ ఆరోపణలను వాట్సాప్‌ ఖండించిది. డబిరి పిక్సల్‌ ఫోన్‌లోని బగ్‌ ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. దీనిపై దర్యాప్తు చేసి పరిష్కరించాలని గూగుల్‌ను అభ్యర్థించినట్టు ట్వీట్‌లో చేసింది.

Post a Comment

0 Comments

Close Menu