Ad Code

జీతాలు పెరగకపోయినా, మీ ఆదాయాన్ని పెంచుకోండి ఇలా !


ఆర్థిక మాంద్యం ముప్పుతో ఇప్పటికే వేలమంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిక మైక్రో సాఫ్ట్, ఈ ఏడాది ఫుల్ టైం శాశ్వతం ఉద్యోగులకు వేతనాల పెంపులు లేవని ప్రకటించింది. ఈ నిర్ణయంపై ఉద్యోగులు అసహనంగా ఉన్నారు. అయితే, కంపెనీ జీతాలు పెంచకపోయినా  ఉద్యోగులు తమ ఆదాయాన్ని పెంచుకోవచ్చని చీఫ్ మర్కెటింగ్ ఆఫీసర్ ఓ సూచన చేశారు. జీతాల పెంపు విషయంలో మైక్రో సాఫ్ట్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఉద్యోగులకు ఇటీవల చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ క్రిస్టోఫర్‌ ఓ ఇంటర్నట్ లేఖ రాసినట్టు సమాచారం. జీతాల విషయంలో కంపెనీ తీసుకున్న నిర్ణయంపై కారణాలను వివరిస్తూ ఆదాయం పెంచుకునే మార్గాన్ని లేఖలో సూచించారు. ఒక వేళ కంపెనీ స్టాక్‌ ధర పెరిగితే  ఆటోమేటిక్‌గా ఉద్యోగులకు అందే పరిహారం కూడా పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ స్టాక్‌ ధర పెరిగేలా పని చేయాలని ఉద్యోగులకు సూచించారు. మెరుగైన త్రైమాసిక ఫలితాలను నమోదు చేస్తే  స్టాక్‌ ధర ఆకర్షణీయంగా మారుతుందన్నారు. ఇప్పటికే ఈ ఏడాది కంపెనీ షేరు విలువ 33 శాతం పెరిగినట్లు క్రిస్టోఫర్‌ తన లేఖలో గుర్తు చేశారు. ఆర్థికంగా అస్థిర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ ఏడాది ఉద్యోగులకు జీతాల పెంపు ఉండదని మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఉద్యోగులకు బోనస్‌లు, స్టాక్‌ అవార్డులు మాత్రం కొనసాగుతాయని తెలిపారు. 

Post a Comment

0 Comments

Close Menu