Ad Code

మాహిల్ దోమల కిల్లర్ మెషిన్ !


మాహిల్ కిల్లర్ మెషిన్ దోమలు, పురుగుల్ని ఆకర్షిస్తుందని చెబుతున్నారు. ఇందులో పర్పుల్ కలర్‌లో ఓ LED లైట్ వెలుగుతూ ఉంటుంది. అది కాంతి తరంగాల్ని పంపిస్తూ ఉంటుంది. ఆ కాంతి అంటే దోమలకు ఇష్టం. అందువల్ల దోమలు దీని దగ్గరకు వెళ్తాయని అంటున్నారు. మెషిన్ దగ్గరకు వచ్చే దోమల్ని తన లోపలికి లాగేసుకుంటుంది. అలా లోపలికి వెళ్లే దోమలు మళ్లీ బయటకు రాలేవు, చనిపోతాయని చెబుతున్నారు. ఇందులో పడిన దోమలు, ఈగలు ఇతర పురుగుల్ని తేలిగ్గా తొలగించవచ్చని తెలిపారు. ఈ మెషిన్‌కి యూఎస్బీ పోర్ట్ ద్వారా ఛార్జింగ్ చెయ్యవచ్చు. మొబైల్ ఛార్జర్, పవర్ బ్యాంక్, ల్యాప్ టాప్ వంటి వాటి ద్వారా ఛార్జ్ చేసుకోవచ్చు. బటన్ నొక్కితే ఇది పనిచేయడం ప్రారంభిస్తుందని వివరించారు. దీనితో యూఎస్బీ కేబుల్ కూడా ఇస్తున్నట్లు తెలిపారు. ఈ మెషిన్‌ని వాడుకోవడం చాలా తేలిక అనీ దీన్ని ఇళ్లు, ట్రిప్స్‌లో వాడుకోవచ్చని తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu