Ad Code

రెగ్యులేషన్స్‌తోనే ప్రతికూలతలను అధిగమించవచ్చు !


ఇంటరాక్టివ్ ఏఐ టూల్ చాట్‌జీపీటీని ఓపెన్ఏఐ ప్రజల ముందుకు తీసుకువచ్చినప్పటి నుంచి ఏఐ టూల్స్‌పై టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్ సాగుతోంది. ఏఐ కాన్సెప్ట్ కొత్త కాకున్నా గత ఏడాది నవంబర్‌లో చాట్‌జీపీటీని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఏఐ టూల్స్‌కు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. చాట్‌జీపీటీ అనంతరం మైక్రోసాఫ్ట్‌, గూగుల్ ఈ ఏడాది ఫిబ్రవరిలో తమ సొంత ఏఐ చాట్‌బాట్స్‌ను లాంఛ్ చేశాయి. ఈ చాట్‌బాట్స్‌కు ఆయా కంపెనీలు ఇంకా తుదిమెరుగులు దిద్దుతూనే ఉన్నా ఏఐ టూల్స్‌కు ఆదరణ లభిస్తుండటంతో పలు కంపెనీలు వీటిని తమ సంస్ధల్లో ప్రవేశపెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఏఐ టెక్నాలజీపై ఇంత చర్చ జరుగుతున్నా వీటి లోటుపాట్లపైనా సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఏఐ నియంత్రణ ఉండాలని రెగ్యులేషన్స్‌తోనే వీటి ప్రతికూలతలను అధిగమించవచ్చని చాట్‌జీపీటీ క్రియేటర్ ఓపెన్ఏఐ సీఈవో సామ్ అల్ట్‌మన్ కోరారు. ఇక బయట నుంచి ఒత్తిడి ఉంటే తప్ప కంపెనీలు ఏఐని సొంతంగా నియంత్రించలేవని గూగుల్ మాజీ ఏఐ పరిశోధకులు టినిట్ గెబ్రూ స్పష్టం చేశారు. కేవలం లాభాపేక్ష కాకుండా ఏఐని మెరుగుపరిచేందుకు నియంత్రణ ఉండాలని అన్నారు. గెబ్రూ 2020 వరకూ గూగుల్ ఎథికల్ ఏఐ టీం కో లీడర్‌గా పనిచేశారు. బయట నుంచి ఒత్తిడి లేకుండా బడా టెక్ కంపెనీలు ఏఐని నియంత్రించలేవని ఆమె పేర్కొన్నారు. ఏఐ వివక్ష ధోరణిపై ప్రశ్నించిన మీదట 2020లో గూగుల్ తనను తొలగించిందని గెబ్రూ చెప్పారు.

Post a Comment

0 Comments

Close Menu