శని గ్రహాన్ని తరచూ చూస్తూనే ఉంటాం. దాని ఉపగ్రహాల్లో ఒకటి ఎన్సెలాడస్. నిజానికి ఇది చాలా చిన్న గ్రహం. చందమామ బఠాణీ గింజ సైజులో ఉంటే.. దాని దగ్గర ఎన్సెలాడస్.. ఆవ గింజ సైజులో ఉంటుంది. కానీ.. ఈ ఉపగ్రహం నాసాను విపరీతంగా ఆకర్షిస్తోంది. నాసాకి చెందిన రోబో పాములు.. ఈ గ్రహాన్ని అన్వేషించనున్నాయి. నాసా స్వయంగా ఈ రోబో పాముల్ని తయారుచేయించింది. ఇటాలియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు రోబో వాన పాములను తయారు చేశారు. శాస్త్రవేత్తల ప్రకారం, పెద్ద రోబోలతో పోలిస్తే ఈ రోబో పాములు చాలా సులభంగా పనిని పూర్తి చేయగలవు. ఈ రోబోలు చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ రోబోలు పాముల్లాగా నేలపై వెళ్తాయి. బోరు తవ్వుతాయి. భూమి లోపలికి వెళ్లగలవు. ఈ రోబోలు... శాస్త్రవేత్తలకు... ఏ ప్రదేశంలోనైనా పరిశోధన, అధ్యయనం చేసేందుకు బాగా సహాయపడగలవు. శని గ్రహానికి 83 చందమామలు ఉన్నాయి. వాటిలో ఒకటైన ఎన్సెలాడస్‌ని 1789లో కనుక్కున్నారు. దీని లోపల ఓ సముద్రం ఉందని నమ్ముతున్నారు. ఆ సముద్రంలో జీవులు ఉండి ఉండొచ్చు అనే అంచనా ఉంది. ఆ విషయాన్ని తెలుసుకునేందుకు నాసాలోని జెట్ ప్రొపల్షన్ ల్యాబ్‌లో రోబో స్నేక్‌లను తయారు చేస్తున్నారు. ఈ రోబో పాములను ఎన్‌సెలాడస్ దక్షిణ ప్రాంతంలో దింపితే... అవి అక్కడ.. దాదాపు 5 కిలోమీటర్ల మంచు పొరను తవ్వుతూ.. లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఇందుకు చాలా టైమ్ పడుతుంది. పూర్తిగా మంచును తవ్వి.. లోపలికి వెళ్లాక.. సముద్రంలో ఈదగలవు. రోబో వానపాముల పొడవు 10 సెంటీమీటర్లు. ఈ వానపాములను సెన్సార్లతో ఆపరేట్ చేయవచ్చు. అమెరికాలోని నోట్రే యూనివర్సిటీ ప్రకారం, ఈ రోబో వానపాములు సొరంగాలు తవ్వే పనిని కూడా చేయగలవు. అందువలన వీటిని మైనింగ్ రంగంలో ఉపయోగించవచ్చు. భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో శిథిలాల్లో చిక్కుకున్న వ్యక్తుల్ని కనుక్కోవడంలో ఈ రోబో పాములు బాగా ఉపయోగపడగలవు. ఎన్సెలాడస్‌లో సముద్రం ఉండటమే కాదు... అది కాస్త వెచ్చగా కూడా ఉండి ఉండొచ్చనే అంచనా ఉంది. అందుకే అక్కడ జీవం ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. నాసా సిద్ధం చేస్తున్న స్నేక్ రోబో పేరు ఎక్సోబయాలజీ ఎక్స్‌టెంట్ లైఫ్ సర్వేయర్ అంటే EELS. ఓ అంచనా ప్రకారం.. ఎన్‌సెలాడస్ ఉపరితలంపై కూడా జీవించే అవకాశం ఉండి ఉండొచ్చు. ఆ విషయాన్ని ఈ పాములు చెప్పగలవని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ పాములు.. ఎన్‌సెలాడస్ సముద్రంలో జీవులు ఉంటే.. వాటిని ఫొటోలు తీసి.. భూమికి పంపగలవు. నిజంగా జీవులు ఉంటే.. అదో చరిత్రాత్మక అంశం అవుతుంది. మనకు మరో భూమి దొరికినట్లు అవుతుంది. చిన్న గ్రహమే అయినప్పటికీ.. అక్కడికి వెళ్లి.. ఆ చుట్టుపక్కల ఉండే యూరోపా, గనీమేడ్ వంటి ఇతర మంచు ఉప గ్రహాలను ఆన్వేషించేందుకు వీలవుతుంది. ఎన్సెలాడస్ ఉపరితలం చాలా చల్లగా ఉంటుంది. అక్కడ ఉష్ణోగ్రత మైనస్ 201 డిగ్రీలు ఉంది. అలాంటి చోట మనుషులు బతకడం సవాలే. కానీ లోపలున్న సముద్రంలో అలాంటి ఉష్ణోగ్రత ఉండదు. అందుకే.. నాసా ఈ చందమామపై ఫోకస్ పెట్టింది. 16 అడుగుల పొడవున్న ఈ రోబో పాము.. శుభవార్త చెబితే.. ఇక మానవుల రోదసీ పయనాలన్నీ ఈ ఉపగ్రహంవైపే సాగుతాయి.
0 Comments