Ad Code

కంప్యూటర్లను మనుషులకు నిజమైన సేవకులుగా మార్చనున్న ఏఐ !


చాట్‌జీపీటీ, బార్డ్‌, బింగ్ వంటి చాట్‌బాట్స్ విశేష ఆదరణ పొందుతుండగా టెక్ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్‌పై హాట్ డిబేట్ సాగుతోంది. మానవుల పనులను తేలికపరుస్తూ సరళతరం చేయడంలో ఈ న్యూ చాట్‌బాట్స్‌, ఏఐ టూల్స్ పోటీ పడుతున్నాయి. న్యూ టెక్నాలజీగా ముందుకొచ్చిన ఏఐ టూల్స్‌ను వ్యక్తుల నుంచి దిగ్గజ సంస్ధల వరకూ తమ దైనందిన కార్యకలాపాల్లో వినియోగించేందుకు మొగ్గుచూపుతున్నారు. ఏఐ ప్రభావం పెరుగుతుండటంతో ఇది కొలువుల కోతకు దారితీస్తుందనే ఆందోళన సైతం వ్యక్తమవుతోంది. ఏఐ పలు ఉద్యోగాలను రీప్లేస్ చేస్తుందని కొందరు నిపుణులు హెచ్చరిస్తుండగా న్యూ టెక్నాలజీతో ఉత్పాదకత మెరుగవుతుందని మరికొందరు పేర్కొంటున్నారు. ఇక గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ భిన్నమైన వాదనను ముందుంచారు. రాబోయే రోజుల్లో ఏఐ మనుషులకు ప్రతికూలంగా వ్యవహరించదని, కంప్యూటర్ల వంటి టెక్నాలజీ టూల్స్‌ను మానవులకు నిజమైన సేవకులుగా మార్చేస్తుందని అన్నారు. యూట్యూబర్ అరుణ్ మైనికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పిచాయ్ స్మార్ట్‌ఫోన్ల భవిష్యత్ సహా పలు అంశాలపై మాట్లాడారు. ఏఐతో స్మార్ట్‌ఫోన్లు కొత్తపుంతలు తొక్కుతాయని చెప్పుకొచ్చారు. టెక్నాలజీ ఆరంభ దశలోనే ఉందని, రాబోయే కాలంలో ఏఐ మరింత సహజంగా మనం ఇంటరాక్ట్ అయ్యేందుకు సరళంగా మారుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో ఏఐ మానవ భాషను మెరుగ్గా అర్ధం చేసుకుంటుందని, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందని చెప్పారు.

Post a Comment

0 Comments

Close Menu