Ad Code

వాట్సాప్ లో మరో మూడు సరికొత్త ఫీచర్లు !


వాట్సప్ తాజాగా మరో మూడు కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ని వాట్సాప్‌ 2022 నవంబర్‌లోనే లాంచ్‌ చేసింది. అయితే తాజా అప్‌డేట్‌లో క్రియేట్‌ సింగిల్‌ ఓట్‌ పోల్‌, సెర్చ్‌ ఫర్‌ పోల్స్‌ ఇన్‌ చాట్స్‌, పోల్‌ రిజల్ట్‌ ను కొత్తగా తీసుకొచ్చింది. వాట్సాప్‌ పోల్స్‌ లో యూజర్లు ఒకటి కన్నా ఎక్కువ సార్లు తమకు నచ్చిన ఆప్షన్‌కు ఓటు వేయవచ్చు. దీని వల్ల పోల్స్‌ ఫలితాల్లో ఖచ్చితత్వం ఉండటం లేదని ఎక్కువ మంది యూజర్లు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఇప్పుడు క్రియేట్‌ సింగిల్‌ ఓట్‌ పోల్‌ అనే ఆప్షన్‌ తీసుకొచ్చారు. దీంతో పోల్‌ లో పాల్గొనే వారు ఒక్కసారి మాత్రమే ఓటు వేయగలరు. ఏదైనా గ్రూప్‌ లో పోల్‌ నిర్వహించినప్పుడు తర్వాత ఓటు వేద్దామని మర్చిపోతే తర్వాత గ్రూప్‌ లో వచ్చిన మెసేజ్‌లతో పోల్‌ ఎక్కడ ఉందనేది వెతకడం కష్టంగా మారుతుంది. ఆ సందర్భంలో పోల్‌ను గుర్తించేందుకు సెర్చ్‌ ఆప్షనలోకి వెళ్లి "polls" అని టైప్‌ చేస్తే మొత్తం పోల్స్‌ జాబితా చూపిస్తుంది. యూజర్లు తాము నిర్వహించే పోల్స్‌లో ఎవరు ఓటు వేసినా.. వెంటనే నోటిఫికేషన్‌ వస్తుంది. దీంతో ఎవరు, ఎప్పుడు ఓటు వేశారో తెలుసుకోవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu