Ad Code

ట్విట్టర్‌ కు గట్టి పోటీ బ్లూస్కై !


ట్విట్టర్‌కు దాని సహ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సే నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. ట్విట్టర్‌ నుంచి బయటకు వచ్చిన అతను డీసెంట్రలైజ్డ్ సోషల్‌ మీడియా ప్రోటోకాల్ ప్రాజెక్ట్ బ్లూస్కై సోషల్‌ని చేపట్టారు. ప్రస్తుతం డెవలప్‌మెంట్‌ స్టేజ్‌లో ఉన్న ఈ అప్లికేషన్‌, మరి కొన్ని రోజుల్లో ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయం అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.  ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయంగా బ్లూస్కై సోషల్‌ని డెవలప్‌ చేస్తున్నారు. ఫిబ్రవరిలో ప్రారంభించినప్పటి నుంచి, ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ లో 100,000 మందికి పైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఈ ప్లాట్‌ఫారమ్ ఇంకా అందరికీ అందుబాటులోకి రాకపోవడంతో, వినియోగదారులు తమ ఇన్వైడ్‌ కోడ్‌లను కూడా విక్రయిస్తున్నారు. కంటెంట్ నియంత్రణ, ప్రైవసీ, సెన్సార్‌షిప్ వంటి సెంట్రలైజ్డ్‌ ప్లాట్‌ఫారమ్‌ల సవాళ్లు, నష్టాలను పరిష్కరించేటప్పుడు మరింత వినూత్నమైన, విభిన్నమైన, యూజర్‌- కంట్రోల్డ్‌ ఆన్‌లైన్ సోషల్‌ స్పేస్‌ని క్రియేట్‌ చేయడమే బ్లూస్కై ప్రధాన లక్ష్యం. ఇది సింగిల్‌ ప్రొడక్ట్‌ లేదా సర్వీస్‌ కాదు. వివిధ డెవలపర్‌లు, కమ్యూనిటీలు ఇంప్లిమెంట్ చేయగల స్టాండర్డ్స్‌, ప్రోటాకాల్స్‌ సముదాయం. బ్లూస్కై సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్, ట్విట్టర్‌ మాదిరిగానే ఉంటుంది. వెర్టికల్లీ స్క్రోలింగ్ సోషల్ మీడియా ఫీడ్‌లో ప్రతి పోస్ట్ కింద లైక్‌, రీపోస్ట్, కామెంట్‌ వంటి ఆప్షన్‌లు ఉంటాయి. వినియోగదారులు తమ డొమైన్‌ను తమ హ్యాండిల్‌గా సెట్ చేసుకోవడం, ఒకే AT ప్రోటోకాల్‌ని ఉపయోగించే వివిధ యాప్‌ల మధ్య స్విచ్‌ కావడం వంటి కొన్ని ప్రత్యేక ఆప్షన్‌లను ఇది అందిస్తుంది. ఇది సెంట్రలైజ్డ్ యాప్ ట్విట్టర్‌లో సాధ్యం కాదు. బ్లూస్కైలో కంటెంట్‌ను మోడరేట్ చేయడానికి ఆటోమేటెడ్ సిస్టమ్‌ను ఉపయోగిస్తారు. ACLU వంటి సంస్థలు సెటప్ చేసిన లేబుల్‌ల ఆధారంగా కంటెంట్‌ను ఫ్లాగ్ చేయడానికి, ఫిల్టర్ చేయడానికి, మ్యూట్ చేయడానికి లేదా బ్యాన్ చేయడానికి వినియోగదారులు, సేవలను అనుమతించే కమ్యూనిటీ లేబులింగ్ సిస్టమ్ కూడా ఉంది. ప్రస్తుతం బ్లూస్కై సోషల్ ఇంకా డెవలప్‌మెంట్‌లో ఉంది. సెలక్టెడ్‌ వినియోగదారులకు మాత్రమే యాప్‌కి యాక్సెస్‌ లభిస్తుంది. ఆసక్తి ఉన్న వినియోగదారులు బ్లూస్కై వెబ్‌సైట్‌లోని వెయిటింగ్ లిస్ట్‌లో ఇమెయిల్ అడ్రెస్‌ ద్వారా జాయిన్‌ కావచ్చు. యాప్‌లో ఉన్న ప్రతి రెండు వారాలకు ఒక ఇన్విటేషన్‌ అందుకోవచ్చు. నెట్‌వర్క్ ఆర్గానికల్లీ పెరగాలని కంపెనీ కోరుకుంటోంది. చాలా వరకు ఇన్విటేషన్‌లు ఇప్పటికే ఉన్న బ్లూస్కై వినియోగదారుల ద్వారా అందించనుంది.

Post a Comment

0 Comments

Close Menu