Ad Code

ఆటోమేటేడ్ బాట్ల వల్ల ముప్పు తప్పదా?


ఆటోమేటేడ్ బాట్లు గత సంవత్సరం ఇంటర్నెట్ లోని మొత్తం ట్రాఫిక్ లో దాదాపు సగం స్థానాన్ని ఆక్రమించాయి. వాటిలో చాలా మంది స్పామ్, స్కామ్ లు, వైరస్ లను వ్యాప్తి చేయడానికి వీటిని ఉపయోగిస్తున్నట్లు తేలింది. ఆన్ లైన్ కార్యకలాపాలలో దాదాపు సగం వరకు మనుషుల కంటే ఆటోమేటెడ్ బాట్లే నిర్వహిస్తున్నట్లు తాజాగా అధ్యయనం వెల్లడించింది. స్పామ్, సైబర్ క్రైమ్లతో AI-శక్తితో పనిచేసే బాట్లు వేగంగా ఇంటర్నెట్ ను స్వాధీనం చేసుకోవడంలో గణనీయంగా పురోగతి సాధించినట్లు తేలింది. 2022లో ఆన్ లైన్ లో ఈ రకమైన యాక్టివిటీలో భారీ పెరుగుదల కనిపించిందని, మొత్తం ఇంటర్నెట్ ట్రాఫిక్ లో 47.4% మనుషుల నుంచి కాకుండా బాట్ల నుండి వస్తున్నాయని Impervaలోని సైబర్ సెక్యూరిటీ నిపుణులు వెల్లడించారు. 'బ్యాడ్ బాట్స్' లేదంటే జంక్ ఈ మెయిల్స్ ను పంపేవి, వ్యక్తుల డేటాను దొంగిలించేవి ఈ ట్రాఫిక్ లో 66.6%ని కలిగి ఉన్నాయని హెచ్చరించారు. ChatGPT, GPT-4 లాంటి సాధనాలు చెడు బాట్లకు 'సూపర్ పవర్స్'గా పని చేయడం విశేషం. వీటిని సైబర్ నేరగాళ్లు ప్రజల వ్యక్తిగత డేటాను దొంగిలించడంతో పాటు ఆన్ లైన్ లో అల్లకల్లోలం కలిగించేందుకు వీటిని ఉపయోగిస్తున్నారు. ఇంపెర్వా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కార్ల్ ట్రైబ్స్ AI-ఆధారిత బాట్ల గురించి కీలక విషయాలు వెల్లడించారు. "2013 నుంచి బాట్లు వేగంగా అభివృద్ధి చెందాయి. అయితే, ఇప్పుడు AI బాట్లు రావడంతో, రాబోయే 10 సంవత్సరాలలో సాంకేతికత మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది” అన్నారు. అంతేకాదు, "సైబర్ నేరగాళ్లు అధునాతన ఆటోమేషన్తో API ఎండింగ్ పాయింట్స్, అప్లికేషన్ బిజినెస్ లాజిక్లపై ఎక్కువగా దాడులు చేస్తారు. ఫలితంగా, బ్యాడ్ బాట్లతో సంబంధం ఉన్న వ్యాపార అంతరాయం, ఆర్థిక ప్రభావం రాబోయే సంవత్సరాల్లో మరింత తీవ్రం అవుతుంది” అని తెలిపారు. సైబర్ వార్ ఫేర్ లో ఈ బాట్లు ఎలా ఉపయోగించబడుతున్నాయో తాజాగా నివేదిక హైలైట్ చేసింది.2022 ప్రారంభంలో ఉక్రేనియన్ వెబ్ సేవలపై దాడులు 145% వరకు పెరిగాయని తెలిపింది. AI-ఆధారిత బాట్లతో తీవ్ర ముప్పు తప్పదంటున్నారు నిపుణులు. మున్ముందు ఇవి ఇంటర్నెట్ మొత్తాన్ని స్వాధీనం చేసుసుకునే అవకాశం ఉంటుందంటున్నారు. అంతేకాదు, ప్రపంచ వ్యాప్తంగా పలు సమస్యలకు కారణం కారణం కాబోతున్నాయంటున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu