Ad Code

ల్యూమినస్ ఇన్వెర్టర్ !


ల్యూమినస్ కంపెనీకి ఇన్వెర్టర్లు, జనరేటర్ల తయారీలోమంచి పేరుంది. ఈ కంపెనీ కొత్తగా iCon 1100 Pure sine Wave Inverterని తీసుకొచ్చింది. ఈ ఇన్వెర్టర్.. ఇంట్లో, ఆఫీసులో ఎక్కడైనా వాడుకోవచ్చని తెలిపింది. దీనికి ప్రత్యేకంగా బ్యాటరీ ఎన్‌క్లోజర్ ఉందని తెలిపింది. ఇండియాలో తయారుచేసిన ఈ ఇన్వెర్టర్ 13 కేజీల బరువుతో ‎76.5 x 50.5 x 24.6 సెంటీమీటర్ల సీజీలో ఉంది. VA రేటింగ్ 900VA ఉంది. పీక్ లోడ్ 756W ఉంది. అవుట్‌పుట్ ఓల్టేజ్ UPS మోడ్‌లో 220V ఉంది. ఇది ప్రీమియం డిజైన్‌తో తయారైందనీ.. బ్యాటరీ కోసం ప్రత్యేక ఎన్‌క్లోజర్ ఉందనీ తెలిపారు. బ్యాటరీ మాత్రం విడిగా కొనుక్కోవాలని తెలిపారు. 1 TV, 5 LED బల్బులు, 3 ఫ్యాన్లు, 4 ట్యూబ్ లైట్స్, 1 ల్యాప్ టాప్, వైఫై రూటర్ కి పనిచేస్తుందని తెలిపారు. 150Ah - 220 Ah పొడవైన ట్యూబులార్ బ్యాటరీలను సపోర్ట్ చేస్తుందని తెలిపారు. ఈ ఇన్వెర్టర్‌కి గ్రీన్, రెడ్ LED లైట్లు ఉన్నాయి. ఇవి యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయని తెలిపారు. ఓవర్ లోడ్, ఓవర్ టెంపరేచర్, బ్యాటరీ డీప్ డిశ్చార్జ్, షార్ట్ సర్క్యూట్‌ వల్ల ఈ ఇన్వెర్టర్ దెబ్బతినదని తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu