Ad Code

కొత్త గ్రహాన్ని కనిపెట్టిన నాసా !


అమెరికా స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ సరికొత్త గ్రహాన్ని కనిపెట్టింది. ఆ గ్రహం భూమి లక్షణాలతో, భూమి కంటే కొద్దిగా పెద్దగా, నిండా అగ్ని పర్వతాలతో ఉంది. అది మన సౌర వ్యవస్థకు అవతల ఉంది. దానికి శాస్త్రవేత్తలు LP 791-18 d అనే పేరు పెట్టారు. ఈ గ్రహంపై తరచూ అగ్ని పర్వతాలు పేలుతూ ఉండొచ్చని నాసా అంచనా వేసింది. నాసాకి చెందిన ట్రాన్సిటింగ్ ఎగ్జోప్లానెట్ సర్వే శాటిలైట్ ద్వారా ఈ కొత్త గ్రహాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. రిటైర్ అయిన స్పిట్జర్ స్పేస్ టెలిస్కోప్ సాయం కూడా తీసుకున్నారు. అలాగే  భూమిపై ఉన్న కొన్ని అబ్జర్వేటరీలు కూడా ఇందుకు ఉపయోగపడ్డాయి. ఈ గ్రహానికి సంబంధించిన వివరాలను  సైంటిఫిక్ జర్నల్ నేచర్‌లో మే 17న ప్రచురించారు. ఈ గ్రహంపై అగ్నిపర్వతాలతోపాటూ.. నీరు కూడా ఉన్నట్లు కనిపిస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ గ్రహం భూమికి 90 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. బహుశా ఈ గ్రహం లోపల మండుతూ ఉండొచ్చనే అంచనా వేశారు. మన సౌర వ్యవస్థలో గురుగ్రహ ఉపగ్రహమైన Io కూడా ఇదే విధంగా అగ్నిపర్వత పేలుళ్లతో ఉంది.  ఈ గ్రహం  ఓ మరుగుజ్జు నక్షత్రం చుట్టూ తిరుగుతోంది. ఈ కొత్త గ్రహం మన భూమి కంటే కొద్దిగా ఎక్కువ వేడిగా ఉంటుంది అంటున్నారు. దీనికి ఎప్పుడూ ఒకేవైపు వేడి, ఎండ పడుతున్నాయనీ, రెండోవైపు ఎలా ఉందో తెలియట్లేదని తెలిపారు. రెండోవైపు ప్రాంతంలో అగ్ని పర్వతాలతోపాటూ  నీరు ఉండొచ్చనే అంచనా వేశారు. ఆ మరుగుజ్జు నక్షత్రం చుట్టూ మరో 2 గ్రహాలు కూడా తిరుగుతున్నాయి. ఈ కొత్త గ్రహం తన సూర్యుడి నుంచి ఉన్న దూరం మరీ ఎక్కువ వేడి, మరీ ఎక్కువ చల్లదనం లేకుండా ఉంది. అందువల్ల దీనిపై జీవించే అవకాశాలు ఉంటాయనే అంచనా ఉంది. 

Post a Comment

0 Comments

Close Menu