Ad Code

జెన్‌పాక్ట్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగాలు !


అమెరికన్ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ జెన్‌పాక్ట్ మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు రిక్రూట్‌మెంట్ చేపడుతున్నట్లు ప్రకటించింది. అర్హులైన అభ్యర్థులు మే 10లోపు దరఖాస్తు చేసుకోవాలి. మేనేజ్‌మెంట్ ట్రైనీ రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. బీకామ్ పూర్తిచేసిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. SAP బేసిక్ నాలెడ్జ్ తెలిసుండాలి. అద్భుతమైన కమ్యూనికేషన్‌తో క్లైయింట్లను ప్రభావితం చేసే స్కిల్స్ ఉండాలి. ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్‌పై మంచి పట్టు ఉండాలి. ఏ షిఫ్ట్‌లోనైనా పని చేయడానికి సిద్ధంగా ఉండాలి. సమస్యలను ముందస్తుగా గుర్తించి సకాలంలో పరిష్కరించే సామర్థ్యం అభ్యర్థుల్లో ఉండాలి. అలాగే టైమ్ మేనేజ్‌మెంట్, అనలైటికల్ స్కిల్స్ ఉండాలి. కాంట్రాక్ట్/పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌పై అవగాహన ఉండాలి. అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసే అవకాశం ఉంది. అయితే కంపెనీ దీనిపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. మాడ్యూల్స్ & సిస్టమ్స్ మధ్య సరైన నాణ్యత, కచ్చితత్వంతో డేటా సమగ్రతను నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. డేటా ప్రాసెసింగ్ SLAలకు కట్టుబడి ఉండాలి. మాన్యువల్‌గా వర్క్‌ను తగ్గించడానికి ఆటోమేషన్ అవకాశాలను గుర్తించాల్సి ఉంటుంది. క్లయింట్లను సమన్వయం చేసుకుంటూ అనలిటికల్ స్కిల్స్ ద్వారా సమస్యల పరిష్కారాన్ని సులభతరం చేయాల్సి ఉంటుంది. క్లయింట్, ఎక్స్‌టర్నల్ ఆడిటర్‌లకు అవసరమైన విధంగా నమూనాలు, ఎవిడెన్స్ అందించాల్సి ఉంటుంది. కస్టమర్ సెంట్రిక్ మైండ్‌సెట్, స్టేటస్ కోను సవాలు చేసే సామర్థ్యం ఉండాలి. క్లయింట్లతో ఎప్పటికప్పుడు ఇంటరాక్షన్ అవుతుండాలి. యూఎస్, LATAM, యూరప్ ప్రాంతాలకు చెందిన టీమ్‌లతో ఎంగేజ్ అవ్వాల్సి ఉంటుంది. ఆడిట్ ప్రక్రియలో కీలకమైన స్కోపింగ్, ప్లానింగ్, ఫీల్డ్‌వర్క్ ఎగ్జిక్యూషన్, రిపోర్టింగ్, ఇష్యూ ట్రాకింగ్ వంటి యాక్టివిటిస్‌ను పర్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. ఎఫిషియన్సీ, ఎఫెక్టివ్‌నెస్ కోసం కంట్రోల్ ఫ్రేమ్‌వర్క్స్ అసెస్ చేయాల్సి ఉంటుంది. ఫైనాన్సియల్ రిస్క్, ఆపరేషనల్ రిస్క్ కోసం ఆన్‌గోయింగ్ రిస్క్ అసెస్‌మెంట్‌లను నిర్వహించాల్సి ఉంటుంది. ఫ్యూచర్ కంట్రోల్ రిస్క్‌లను వీలైనంత వరకు తగ్గించడానికి బిజినెస్ ప్రాసెస్, ఇంటర్నల్ కంట్రోల్స్ కోసం తగిన సూచనలు చేయాల్సి ఉంటుంది. ఇన్‌వెస్టిగేషన్, స్ట్రాటజిక్, పెద్ద ప్రాజెక్టుల్లో కూడా పాల్గొనాల్సి ఉంటుంది.

Post a Comment

0 Comments

Close Menu