Ad Code

త్వరలో వన్‌ప్లస్‌ ఫోల్డబుల్‌ ఫోన్ !


వన్ ప్లస్ ఫోల్డ్‌బుల్‌ ఫోన్‌ను ఈ సంవత్సరంలోనే లాంచ్‌ చేసే అవకాశం ఉంది. MWC 2023 కార్యక్రమంలో ఈ ఫోన్‌ను విడుదల చేయనుందని సమాచారం. అయితే వన్‌ప్లస్‌ సంస్థ మాత్రం ఎప్పుడు విడుదల చేస్తుందనే వివరాలు అధికారికంగా వెల్లడించలేదు. వన్‌ప్లస్‌ ఫోల్డబుల్‌ ఫోన్‌ శాంసంగ్‌, ఒప్పో, మోటరోలా ఫోన్‌లతో పోటీపడాల్సి ఉంటుంది. ఆ సంస్థలు ఫోన్లను ఇప్పటికే విడుదల చేయగా.. వన్‌ప్లస్‌ ఫోల్డబుల్‌ ఫోన్‌ను లాంచ్‌ కావాల్సి ఉంది. వన్‌ప్లస్‌ తన మొదటి ఫోల్డబుల్‌ ఫోన్‌ను 2023 ఆగస్టులో లాంచ్‌ చేయనుందని టిప్‌స్టర్‌ MaxJambor ట్వీట్‌ చేశారు. వన్‌ప్లస్‌ కూడా ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ను ఈ సంవత్సరం మూడో త్రైమాసికంలో విడుదల చేస్తామనే సంకేతాలు ఇప్పటికే ఇచ్చింది. దాంతోపాటు ఫోల్డబుల్‌ ఫోన్‌కు సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేసింది. అయితే వన్‌ప్లస్‌ ఫోల్డబుల్‌ ఫోన్‌కు సంబంధించిన స్పేసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు వెల్లడించలేదు. వన్‌ప్లస్‌ మొదటి ఫోల్డబుల్‌ ఫోన్‌... శాంసంగ్‌ గెలాక్సీ Z Fold 4 తరహాలోనే 2K డిస్‌ప్లేను కలిగి ఉంటుందంటూ కొన్ని ఉహాగానాలు బయటకు వస్తున్నాయి. ఈ సంవత్సరం మొదటి లోనే వన్‌ప్లస్‌ సంస్థ రెండు ట్రేడ్‌మార్క్‌ ఫోన్లు Oneplus V Fold, Oneplus V Filp మోడల్‌ను లాంచ్‌ చేయనుందని సమాచారం మాత్రం బయటకు వచ్చింది. రెండు ఫోల్డబుల్‌ ఫోన్లలో కన్వెన్షన్‌ ఫోల్డింగ్‌, clamshell ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్లుగా తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వన్‌ప్లస్‌ సంస్థ మాత్రం ఫోల్డబుల్‌ ఫోన్ల గురించి ఎక్కడా సమాచారం ఇవ్వలేదు. ఈ ఫోల్డబుల్‌ ఫోన్లతోపాటు వన్‌ప్లస్‌ Nord N30 ఫోన్‌ తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోందని సమాచారం. గూగుల్‌ ప్లే కన్సోల్‌ లిస్టింగ్‌లో వన్‌ప్లస్‌ నార్డ్‌ N30 స్మార్ట్‌ఫోన్‌ను గుర్తించారు. నార్డ్‌ N30 స్మార్ట్‌ఫోన్.. నార్డ్‌ N20కి కొనసాగింపు వెర్షన్‌గా తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికాలో ఈ ఫోన్‌ను... వన్‌ప్లస్‌ నార్డ్‌ CE3 Lite 5Gకి రీబ్రాండెండ్‌ వెర్షన్‌గా రానుందని సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్‌ పుల్‌ HD+ డిస్‌ప్లే మరియు 8GB ర్యామ్‌, స్నాప్‌డ్రాగన్‌ 695 SoCతో విడుదల కానుందని సమాచారం.

Post a Comment

0 Comments

Close Menu