Ad Code

సెర్నర్‌లో మూడు వేల మంది ఉద్యోగుల తొలగింపు ?


క్లౌడ్ దిగ్గజం ఒరాకిల్ కొనుగోలు చేసిన ఎలక్ట్రానిక్ హెల్త్‌కేర్ రికార్డ్స్ కంపెనీ సెర్నర్‌లో 3000 మంది ఉద్యోగులపై వేటు వేసిందని సమాచారం. గత ఏడాది జూన్‌లో సెర్నర్‌ను ఒరాకిల్ కొనుగోలు చేయగా అప్పటినుంచి వేతన పెంపును, పదోన్నతులను నిలిపివేసింది. యూనిట్‌లో వేలాది ఉద్యోగులను విధుల నుంచి తొలగించిందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించినట్టు ఇన్‌సైడర్ తెలిపింది. సెర్నర్ కంపెనీలోని మార్కెటింగ్‌, ఇంజనీరింగ్‌, అకౌంటింగ్‌, లీగల్‌, ప్రోడక్ట్ విభాగాల్లో పలువురు ఉద్యోగులపై ఒరాకిల్‌ వేటు వేసిందని మాజీ ఉద్యోగి వెల్లడించినట్టు ఇన్‌సైడర్ రిపోర్ట్ పేర్కొంది.

Post a Comment

0 Comments

Close Menu