Ad Code

స్టిక్కర్లను మీరే తయారు చేసుకోవచ్చు?


వాట్సాప్ సంస్థ తాజాగా మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. వాట్సాప్ కొత్త ఫీచర్ స్టిక్కర్ మేకర్ టూల్ పై పని చేస్తోంది. ఈ ఫీచర్‌ iOSలోని అప్లికేషన్‌లో స్టిక్కర్‌లను క్రియేట్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. కాగా చాట్ షేర్ యాక్షన్ షీట్‌లో కొత్త స్టిక్కర్ ఆప్షన్‌ను తీసుకురావాలని కంపెనీ ఆలోచిస్తోంది. ఈ ఫీచర్ వినియోగదారులు తమ లైబ్రరీ నుంచి ఫోటోలను ఎంచుకోవడానికి, బ్యాక్‌ గ్రౌండ్ తీసివేయడానికి అవకాశం కల్పిస్తుంది. పూర్తి ఎడిటింగ్ అవకాశాన్ని కూడా కల్పిస్తుంది.ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తే థర్డ్ పార్టీ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. వాట్సాప్ వెబ్, డెస్క్‌టాప్‌లో ఇప్పటికే ఈ సదుపాయం ఉందని, అయితే iOSలో డెవలప్ చేసిన టూల్ వినియోగదారులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని వాట్సాప్ యాజమాన్యం పేర్కొంది. యాప్‌లో స్టిక్కర్ మేకర్ సాధనాన్ని ఉపయోగించి స్టిక్కర్లను సృష్టించగల ఫీచర్ ప్రస్తుతం పురోగతిలో ఉందని, త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని తెలిపింది.

Post a Comment

0 Comments

Close Menu