Ad Code

వాట్సాప్‌ బ్యాక్‌ అప్‌లకు ఇక గూగుల్‌ డ్రైవ్‌తో పనేలేదు ?


వాట్సాప్‌ మీ చాట్లను వివిధ డివైజ్‌లలో గూగుల్‌ డ్రైవ్‌ని వినియోగించుకొని సింక్రనైజ్‌ చేస్తుంది. ఇందుకోసం వాట్సాప్‌కు ఇప్పటి వరకూ ప్రత్యేకమైన డివైజ్‌ ఏమీ లేదు. ముఖ్యంగా ఆండ్రాయిడ్‌ యూజర్లకు గూగుల్‌ డ్రైవ్‌ లోనే వాట్సాప్‌ చాట్లను బ్యాక్‌ అప్‌ చేస్తుంది. అయితే వాబీటాఇన్‌ఫో రిపోర్టు ప్రకారం ఆండ్రాయిడ్‌ వినియోగదారుల కోసం కొత్త ఫీచర్‌ను వాట్సాప్ అభివృద్ధి చేసింది. గూగుల్‌ డ్రైవ్‌ ని వినియోగించుకోకుండా తన సొంతంగా చాట్‌లను బాక్‌ అప్‌ చేసుకొనేలా ఈ ఫీచర్‌ ను తీసుకొచ్చింది. ఇప్పటికే కొన్ని బీటా వెర్షన్లలో దీనిని పరీక్షించినట్లు రిపోర్టు స్పష్టం చేస్తోంది. వాట్సాప్‌ కొత్త చాట్‌ ట్రాన్స్‌ఫర్‌ ఫీచర్‌ను తీసుకొస్తోంది. కొంత మంది బీటా టెస్టర్లకు ఆండ్రాయిడ్‌ 2.23.9.19 అనే అప్‌ డేట్‌ గూగుల్‌ ప్లే స్టోర్‌ లో అందుబాటులో ఉంది. త్వరలో ఇది అందరికీ అందుబాటులో ఉండనుంది. ఈ ఫీచర్‌ తో చాట్స్‌ ఒక డివైజ్‌ లోని వాట్సాప్‌ నుంచి కొత్త డివైజ్‌లోని వాట్సాప్‌కు ట్రాన్స్‌ ఫర్‌ అవుతాయి. ఈ విధానాన్ని ప్రారంభించాలంటే వినియోగదారులు ఓ క్యూఆర్‌కోడ్‌ ని స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చే సూచనలు ఫాలో అవ్వాలి. అప్పుడు చాట్‌ హిస్టరీ మొత్తం మరో డివైజ్‌లోకి వచ్చేస్తుంది. ఇది సులభంగా, వేగంగా చాట్‌ హిస్టరీ ట్రాన్స్‌ఫర్‌ ను అనుమతిస్తుంది. గూగుల్‌ డ్రైవ్‌ వినియోగించుకోకుండానే దీనిని ఇది నిర్వహిస్తుంది. కేవలం క్యూ ఆర్‌కోడ్‌ స్కాన్‌ తో చాట్‌ హిస్టరీని పొందడంతో పాటు బ్యాక్‌ కూడా చేసుకోవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu