Ad Code

ఇన్ఫోసిస్ ఉద్యోగులకు ఫ్రీగా షేర్లు !


ఉద్యోగులను ప్రోత్సహించేందుకు  కంపెనీలు బోనస్, ఇన్సెంటివ్స్ ప్రకటిస్తుంటాయి. ఇన్ఫోసిస్ మాత్రం తమ ఉద్యోగులకు భారీ కానుకను ప్రకటించింది. రూ.64 కోట్లు విలువైన 5,11,862 ఈక్విటీ షేర్లను కేటాయించినట్లు తెలిపింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేసిన ఇన్ఫోసిస్ 2013 స్టాక్ ఇన్సెంటివ్ కాంపెన్సేషన్ ప్లాన్ కింద 1,04,335 ఈక్విటీ షేర్లు, ఇన్ఫోసిస్ ఎక్స్ పాండెడ్ స్టాక్ ఓనర్షిప్ ప్రోగ్రామ్ 2019 కింద 4,07,527 ఈక్విటీ షేర్లను ఉద్యోగుల కోసం కేటాయించినట్లు నిర్ణయించింది. దీంతో కంపెనీ విస్తరించిన షేర్ క్యాపిటల్ రూ.2,074.9 కోట్లకు చేరుకుంది. ఇన్ఫోసిస్ ఎక్స్పాండెడ్ స్టాక్ ఓనర్షిప్ ప్రోగ్రామ్ 2019 ఏంటంటే.. ఈ పనితీరు ఆధారిత స్టాక్ గ్రాంట్ ప్రోగ్రామ్ ద్వారా ఉద్యోగుల్లోని ప్రతిభను ప్రోత్సహించడం, వాళ్లను కంపెనీలో నిలుపుకోవడం, కంపెనీలోకి ఆకర్షించడమని ఇన్ఫోసిస్ వెల్లిడించింది. ఈ ప్లాన్లో ఇన్ఫోసిస్ సంస్థ ఉద్యోగులందరూ పాల్గొనడానికి అర్హులు. అయితే, ఉద్యోగులు అర్హులు అవునా? కాదా? అన్న విషయాన్ని వాళ్ల స్థాయి, పనితీరు, ఇతర ప్రమాణాల ఆధారంగా సంస్థ నిర్ణయిస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu