Ad Code

వర్క్ ఫ్రం హోం నైతికంగా సరైంది కాదు !


ఇంటి నుంచి ల్యాప్‌టాప్‌తో కసరత్తు సాగించడం ఉత్పాదకతపై ప్రభావం చూపడమే కాకుండా ఈ వెసులుబాటు లేని ఫ్యాక్టరీ కార్మికులు, ఇతర ఉద్యోగులకు తప్పుడు సంకేతాలు పంపుతుందని ఎలన్ మస్క్ వ్యాఖ్యానించారు. కార్లు తయారుచేసే వారు, సర్వీసింగ్ సిబ్బంది, ఇండ్లు కట్టే కార్మికులు, మరమ్మత్తులు చేసేవారు, ఆహారం తయారు చేసేవారు మనం వాడే వస్తువులన్నింటినీ తయారు చేసేవారంతా విధిగా పని ప్రదేశాలకు వెళతారని, మీరు మాత్రం ఇంటి నుంచే పని చేస్తారని సీఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. ఇది కేవలం ఉత్పాదకతకు సంబంధించిన అంశమే కాదని, నైతికంగా కూడా సరైంది కాదని మస్క్ స్పష్టం చేశారు. కార్యాలయాలకు ఉద్యోగులు తిరిగి రావాలని గట్టిగా కోరే మస్క్ గత వేసవిలో టెస్లా ఉద్యోగులను కార్యాలయాల నుంచే పనిచేయాలని హెచ్చరించారు. ఉద్యోగులు వారానికి కనీసం 40 గంటలు ఆఫీస్‌లో గడపాలని కోరారు.

Post a Comment

0 Comments

Close Menu