Ad Code

ఏఐ ఇంజనీర్లకు భారీ డిమాండ్ !


ఏడు నెలల క్రితం వరకు మనకు తెలియని ఏదైనా సమాచారం కోసం శోధించాలంటే దానికి గూగులే శరణ్యం. కానీ ప్రముఖ స్టార్ట్ అప్ కంపెనీ ఓపెన్ ఏఐ ఆధ్వర్యంలో చాట్ జిపిటి వచ్చిన తర్వాత ఇంటర్నెట్ లో బ్రౌజింగ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఓపెన్ ఏఐ ఆధారిత చాట్ జిపిటి విజయం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ నిపుణులకు డిమాండ్ పెరిగింది. ఇక దీని ప్రభావం భారత్లో కూడా ఉంది.. నాస్ కామ్ అంచనా ప్రకారం భారత్లో ప్రస్తుతం 4.16 లక్షల ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ నిపుణులు ఉన్నారు. అయినప్పటికీ మరో 2.13 లక్షల మంది అదనపు ఏఐ ఇంజనీర్లకు డిమాండ్ ఉంది. మరోవైపు చాట్ జిపిటికి పోటీగా గూగుల్ మొదలు బైదూ, మైక్రోసాఫ్ట్, మెటా, ట్విట్టర్.. దాదాపు అన్ని టెక్ కంపెనీలు సొంత ఏఐ సెర్చ్ ఇంజన్ల తయారీలో తలమునకలయి ఉన్నాయి. ఈ ప్రభావం వల్ల సిలికాన్ వ్యాలీ మొదలు బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ వరకు.. టెక్ కంపెనీలు ఏఐ ఇంజనీర్ల నియామకాలు చేపడుతున్నాయి. పలు టెక్ కంపెనీలు ఏఐ నిపుణులకు 30 నుంచి 50 శాతం వరకు ఇంక్రిమెంట్లు ఇస్తూ కొత్త ఉద్యోగాలతో స్వాగతం పలుకుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను డిమాండ్ భారీగా ఉండే హెల్త్ కేర్, ఫైనాన్స్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో విరివిగా వాడేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ విభాగాల్లో గిరాకీ ఎక్కువగా ఉండటం వల్లే కంపెనీలు ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి. అయితే కంపెనీల డిమాండ్ కు తగ్గట్టుగా ఆర్టిఫిషియల్ ఇంజనీర్లు మార్కెట్లో అందుబాటులో లేరు. కొన్ని కంపెనీలయితే ఆర్టిఫిషియల్ ఇంజనీర్లకు డబుల్ శాలరీ ఆఫర్ చేస్తున్నాయి. నాస్ కాం అంచనా ప్రకారం ప్రతిభావంతులైన ఐటీ నిపుణుల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. ఆయనప్పటికీ డిమాండ్ కు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంజనీర్లను అందించలేకపోతోంది.. హై స్కిల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, బిగ్ డేటా టాలెంట్ వంటి టూల్స్ విభాగంలో భారత్ ప్రపంచానికే అతి పెద్ద దన్నుగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఏఐ టాలెంట్ పూల్ లో భారత్ వాటా 16%. భారత్ కంటే అమెరికా, చైనా ముందు ఉన్నాయి. అమెరికాలోని పోస్టల్ కేంద్రంగా పనిచేస్తున్న టాబ్స్క్రిప్షన్ స్టార్టప్ సంస్థ ఫ్లెక్సీ కార్.. భారత ఐటీ రాజధాని బెంగళూరులో డేటా సైన్స్ విభాగంలో కంప్యూటర్ విజన్ స్పెషలిస్టులు, ఇంజనీర్ల టీం నిర్మిస్తోంది. బెంగళూరులో సరిపడా ఇంజనీరింగ్ టాలెంట్ ఉన్నప్పటికీ.. ఇది మార్కెట్ అవసరాలకు సరిపోదని నిపుణులు చెబుతున్నారు. ఇక గత ఏడాది కాలంలో భారత్లో 66 న్యూ టెక్ ఇన్నోవేషన్ కేంద్రాలు ఏర్పాటు అయ్యాయి. వీటిని టెక్ పరిభాషలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు అని పిలుస్తున్నారు. ప్రస్తుతం ఇన్నోవేషన్ కేంద్రాల సంఖ్య భారత దేశంలో 1600 దాకా ఉంది. ఇక తక్కువ వేతనాలు ఇచ్చి స్కిల్డ్ ఇప్పునులను తయారు చేసేందుకు. ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థ సీజీసీ ఆర్అండ్ డీ హబ్ లను ఏర్పాటు చేస్తోంది. అంటే వీటి వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఇంజనీర్లను తయారు చేసుకోవడం.. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాప కింద నీరు లాగా విస్తరిస్తున్న నేపథ్యంలో.. చాలా మంది ఉద్యోగాలు కోల్పోతారని టెక్ నిపుణులు భయపడుతున్నారు. ఇది ఐటీ పరిశ్రమకు మంచిది కాదని హితవు పలుకుతున్నారు.

Post a Comment

0 Comments

Close Menu