Ad Code

వాట్సాప్ లో చాట్ లాక్ ఫీచర్ ?


వాట్సాప్ ని వేలి ముద్రతో లాక్, అన్ లాక్ చేసుకునే సదుపాయం ఉంది. అయితే లాక్ చేసినా ఎవరైనా పంపిన మెసేజులు నోటిఫికేషన్ వచ్చినప్పుడు కనబడతాయి. అయితే ఇప్పుడు వాట్సాప్ తీసుకొస్తున్న సరికొత్త ఫీచర్ తో ఆ మెసేజులు కనబడవు. చాలా మంది  కొంతమందితో చేసే సంభాషణలను ఇతరులకు తెలియకుండా ఉండాలని మేనేజ్ చేస్తుంటారు. బిజినెస్ కి సంబంధించినవి కావచ్చు,లేదంటే పర్సనల్ విషయాలు కూడా కావచ్చు. కానీ ఆ చాట్ సంభాషణ అనేది ఇతరులకు కనబడకుండా దాచాలని అనుకుంటారు. వాట్సాప్ ఆన్ చేయగానే తమ సంభాషణ కనబడకుండా ఆర్చివ్ ఆప్షన్ ను ఎంపిక చేసుకుంటారు. దీని వల్ల ఒక వ్యక్తికీ సంబంధించిన చాట్ గానీ గ్రూప్ గానీ ఆర్చివ్డ్ అనే ప్రత్యేకమైన ఫోల్డర్ లోకి వెళ్ళిపోతుంది. కానీ ఇది వాట్సాప్ లో టాప్ లో కనబడుతుంది. ఇది అంత భద్రమేమీ కాదు కానీ ఎక్కువ మెసేజులు రిపీటెడ్ గా వస్తున్నాయి అంటే గనుక డిస్టర్బెన్స్ గా ఉండకుండా ఉండడం కోసం ఈ ఫోల్డర్ ఉపయోగపడుతుంది. అయితే ఎవరూ కూడా వేరొకరితో చేసిన చాట్ ని చూడకూడదు, లాక్ చేసుకునే సదుపాయం ఉంటే బాగుటుంది అని అనుకునేవారి కోసమే ఈ సరికొత్త ఫీచర్. వాట్సాప్ చాట్ లాక్ అనే ఫీచర్ ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇది మీ సన్నిహితుల సంభాషణలకు సంబంధించిన చాట్ ను పాస్వర్డ్ తో భద్రపరుస్తుంది. ఎవరైనా మీకు మెసేజులు పంపితే ఆ చాట్ ను లాక్ చేసుకోవచ్చు. ఒక ప్రత్యేకమైన ఫోల్డర్ లో భద్రపరుస్తుంది. అంతేకాదు మెసేజులు పంపిన వారి పేరు గానీ, కంటెంట్ ను గానీ ఇది చూపించదు. లాక్ ఓపెన్ చేస్తేనే గానీ వారి ఏం మెసేజ్ చేశారో, ఎవరు పంపారో అనేది తెలియదు. ఈ వాట్సాప్ చాట్ లాక్ ఫీచర్ మీ సంభాషణలను ఎక్కువ ప్రైవేట్ గా ఉంచుతామని ఈ చాట్స్ అనేవి పాస్వర్డ్ తో ప్రొటెక్ట్ చేయబడిన ప్రత్యేకమైన ఫోల్డర్ లో స్టోర్ అయి ఉంటాయని మెసేజ్ చేసిన వారి పేరు గానీ, మెసేజ్ కంటెంట్ గానీ నోటిఫికేషన్ లో కనబడదని మార్క్ జుకర్ బర్గ్ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా వెల్లడించారు. 

Post a Comment

0 Comments

Close Menu