Ad Code

మైక్రోసాఫ్ట్ బింగ్‌లో న్యూ ఏఐ టూల్స్ !


చాట్‌జీపీటీ వచ్చిన తర్వాత ఇంటర్నెట్ బ్రౌజింగ్‌లో సమూల మార్పులు వచ్చేశాయి. యూజర్లకు అవసరమైన ఇన్ఫర్మేషన్.. చక్కగా అర్థమయ్యేలా అందిస్తుండటంతో నెటిజన్లలో అత్యధికులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత చాట్‌జీపీటీ టూల్ వాడటానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఓపెన్ ఏఐ ఆధ్వర్యంలోని చాట్‌జీపీటీలో పెట్టుబడులు పెట్టిన మైక్రోసాఫ్ట్.. తన సెర్చింజన్ 'మైక్రోసాఫ్ట్ బింగ్'లో ఏఐ చాట్ టూల్ తీసుకొచ్చింది. సోషల్ మీడియా దిగ్గజాలు మెటా, ట్విట్టర్ కూడా సొంతంగా చాట్ జీపీటీ వ్యవస్థలను అందుబాటులోకి తెచ్చే పనిలో బిజీబిజీగా ఉన్నాయి. ఈ తరుణంలో మైక్రోసాఫ్ట్ బింగ్ చాట్ పనితీరు ఎలా ఉంటుంది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తే.. కుడి వైపు బింగ్ ఐకాన్ కనిపిస్తూ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే 'బింగ్ ఏఐ చాట్ పేజీ' వస్తుంది. అందులో కింద సెర్చ్ బార్ లో యూజర్ అడిగే సమాచారానికి సంబంధించిన ప్రశ్నలు అడిగితే బింగ్ చాట్ జవాబులు ఇస్తూ ఉంటుంది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కాకుండా మరే బ్రౌజర్‌లోనైనా మైక్రోసాఫ్ట్ బింగ్ అని టైప్ చేస్తే సెర్చింజన్ రిజల్ట్ వస్తది. అందులో బింగ్‌పై క్లిక్ చేస్తే 'సెర్చింజన్' పేజీ వస్తుంది. ఆ పేజీలో ఎడమ వైపు కనిపించే చాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఎడ్జ్ బ్రౌజర్ లో మాత్రమే బింగ్ చాట్ పని చేస్తుందని సూచిస్తుంది. బింగ్ చాట్‌లో సమాచారం తెలుసుకునే వారు తొలి ఐదు ప్రశ్నలకు లాగ్ఇన్ కావాల్సిన అవసరం లేదు. అంతకంటే ఎక్కువ ప్రశ్నలు అడగాలంటే మాత్రం మైక్రోసాఫ్ట్ ఖాతాలో లాగ్ఇన్ కావాల్సిందే. ఒక సెషన్‌లో 20 ప్రశ్నేలే అడగటానికి పర్మిషన్ ఉంటుంది. ఇది పూర్తిగా ఫ్రీ సర్వీస్ అందిస్తుంది. 20 ప్రశ్నల లిమిట్ దాటిన తర్వాత యూజర్ కొత్తగా మరో 20 అంశాలపై ప్రశ్నలు వేయాలనుకుంటే మాత్రం.. సెర్చ్ బార్ పక్కనే గల న్యూ టాపిక్ ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా న్యూ టాపిక్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే చాట్ హిస్టరీ అంతా డిలిట్ అవుతుంది. మరో 20 ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు బింగ్ చాట్ చూపుతుంది. పాత చాట్ హిస్టరీ ఇందులో నిల్వ ఉండదు. అయితే, బింగ్ చాట్ ఇచ్చే సమాధానాల్లో సరైన ఇన్ఫర్మేషన్ ఉండట్లేదని యూజర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఒక సెషన్ లోనే 50 ప్రశ్నల లిమిట్ ఉంటే.. విమర్శల నేపథ్యంలో 20 ప్రశ్నలకు తగ్గించేరని యూజర్ల నుంచి ఆరోపణలు ఉన్నాయి. ఈ సమస్క పరిష్కారానికి మైక్రోసాఫ్ట్ చర్యలు తీసుకోవాలని యూజర్లు అభిప్రాయ పడుతున్నారు. మైక్రోసాఫ్ట్ అంతటితో ఆగకుండా ఏఐ ఆధారిత కొత్త ఫీచర్లను కూడా తీసుకొచ్చింది. బింగ్ ఇమేజ్ క్రియేటర్, బింగ్ ఎడ్జ్ యాక్షన్స్, బింగ్ కంపోజ్, బింగ్ యాక్షన్స్ అనే ఫీచర్లు తెచ్చింది. తద్వారా యూజర్లు తమకు నచ్చినట్లు ఇమేజ్‌లు డిజైన్ చేసుకోవడంతోపాటు లెటర్లు కూడా కంపోజ్ చేసుకోవచ్చునని తెలిపింది.

Post a Comment

0 Comments

Close Menu