Ad Code

త్వరలో ఒప్పో రెనో 10 సీరిస్‌ ఫోన్లు విడుదల


ఒప్పో
నుంచి  రెనో 10 సీరిస్‌ పేరిట మూడు ఫోన్లు విడుదల కానున్నాయి. ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ఈ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. ఒప్పో రెనో 10 సీరిస్‌ స్మార్ట్‌ఫోన్లు 3x ఆప్టికల్‌ జూమ్‌తో పెరిస్కోప్‌ లెన్స్‌లను కలిగి ఉండనున్నాయి. ఫలితంగా మెరుగైన, నాణ్యమైన ఫోటోలను తీసుకోవచ్చని సంస్థ తెలిపింది. పెద్ద భవనాలు, పర్వతాలు, స్మారక చిహ్నాల వంటి ప్రాంతాల్లో ఫోటోలను తీసుకొనే సమయంలో అవన్ని కొంత దగ్గరగా కనిపించే అవకాశం ఉందని చెబుతోంది. ఒప్పో రెనో 10 ప్రో+ పెరిస్కోప్‌ డిజైన్‌ను కలిగి ఉంటుంది. వెనుక కెమెరా బంప్‌ మరింత మందంగా లేకుండా లెన్స్‌, సెన్సార్లను ఒకింత పక్కకు తిప్పి అమర్చినట్లు తెలుస్తోంది. ఇతర స్మార్ట్‌ఫోన్లతో పోల్చితే రెనో 10 సీరిస్‌ ఫోన్లు 0.96మిమీ సన్నని పెరిస్కోప్‌ మాడ్యూల్‌ను కలిగి ఉంటాయని ఒప్పో చెబుతోంది. రెనో 10 ప్రో, రెనో 10 ప్రో+ స్మార్ట్‌ఫోన్లు కూడా 64MP టెలిఫోటో వెనుక కెమెరాను కలిగి ఉండనున్నాయి. ప్రస్తుతం ఉన్న ఫోన్లతో పోలిస్తే రెనో సీరిస్‌ ఫోన్లు మాత్రమే అత్యధిక మెగాపిక్సల్‌ టెలిఫోటో కెమెరా కలిగి ఉన్నాయని ఒప్పో చెబుతోంది. 3x ఆప్టికల్‌ జూమ్‌తో కూడిన 1/2 అంగుళాల ఇమేజ్‌ సెన్సార్‌లను కలిగి ఉంటుంది పేర్కొంది. ఈ సెన్సార్‌ OIS సపోర్ట్‌ చేస్తుందని, 120x హైబ్రిడ్‌ జూమ్‌ను కలిగి ఉండనుంది.

దీంతోపాటు 50MP సోనీ IMX890 సెన్సార్‌, 1/1.56 అంగుళాల ఆల్ట్రాలార్జ్‌ సెన్సార్‌ను కలిగి ఉండనుంది. మరింత స్థిరంగా మరియు స్పష్టత కోసం OIS, ఆల్‌ పిక్సెల్‌ ఓమ్ని డెరైక్షనల్‌ ఫోకస్‌ సపోర్టును కలిగి ఉంటుంది. వెనుక కెమెరా సెటప్‌లో భాగంగా మరో 8MP సోనీ IMX355 సెన్సార్ కలిగి ఉంటుంది. 112 డిగ్రీ ఆల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరాతో 1/4 అంగుళాల సెన్సార్‌లను కలిగి ఉంటుంది. వీటితోపాటు రెనో 10 ప్రో + స్మార్ట్‌ఫోన్లు 4k నాణ్యత కలిగిన ఫోటో, వీడియోల కోసం ప్రత్యేక కెమెరా ఆల్గారిధమ్‌ను కలిగి ఉంది. రెనో 10 సీరిస్‌ ఫోన్లు ముందువైపు 32MP సోనీ IMX709 సెన్సార్‌ను కలిగి ఉండనుంది. తక్కువ కాంతిలోనూ ముఖాన్ని గుర్తుపట్టే విధంగా ప్రత్యేక వ్యవస్థను పనిచేయనుంది. 1/2.47 అంగుళాల సెన్సార్, 90 డిగ్రీల FOVని కలిగి ఉంది. వైడ్‌ యాంగిల్‌ సెల్ఫీలు తీసుకొనేందుకు ఇది ఉపయోగపడుతుంది.

ఒప్పో రెనో 10 ప్రో + క్వా్ల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 8+ జెన్1 ప్రోసెసర్‌ను కలిగి ఉండనుంది. ఈ ఫోన్‌ టీజర్‌ ప్రకారం రెన్‌ 10 సీరిస్‌ ఫోన్లు స్లిమ్‌ ఫ్రోఫైల్‌ మరియు పంచ్‌ హోల్‌ డిజైన్‌తో కూడిన కర్వడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ రెండు రంగుల్లో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ ఫోన్‌ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఒప్పో రెనో 10 స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.31,000 నుంచి రూ.33,000 మధ్య ఉండే అవకాశం ఉంది. ఒప్పో రెనో 10 ప్రో ధర రూ.35,000 నుంచి రూ.39,000 మధ్య అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఒప్పో రెనో 10 ప్రో+ ధర రూ.41,000 నుంచి రూ.43,000 మధ్య ఉండే అవకాశం ఉంది. సుమారుగా ఈ ఫోన్‌ జులైలో విడుదల అయ్యే అవకాశం ఉంది.   https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu