Ad Code

రియల్‌మీ 11 ప్రో సిరీస్ స్మార్ట్‌ఫోన్ల ప్రీబుక్ ఆఫర్స్ జూన్ 15 వరకే !


రియల్‌మీ 11 ప్రో, రియల్‌మీ 11 ప్రో ప్లస్ మోడల్స్‌ని కంపెనీ లాంఛ్ చేసింది. ఈ రెండు స్మార్ట్‌పోన్ల ఫీచర్స్ దాదాపు ఒకేలా ఉన్నాయి. కేవలం మెయిన్ కెమెరా, బ్యాటరీలో మాత్రమే మార్పులు ఉన్నాయి. రియల్‌మీ 11 ప్రో ప్లస్ రూ.30,000 లోపు బడ్జెట్‌లో రిలీజ్ అయితే, రియల్‌మీ 11 ప్రో రూ.25,000 లోపు రిలీజైంది. ప్రారంభ ధర రూ.23,999.  రియల్‌మీ 11 ప్రో ప్లస్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27,999 కాగా, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999. ప్రీ-బుకింగ్ ప్రారంభమైంది. రూ.1,500 బ్యాంక్ డిస్కౌంట్‌తో పాటు రూ.500 ఆఫ్ కూపన్ పొందొచ్చు. దీంతో పాటు రియల్‌మీ వాచ్ కొనడానికి రూ.1,500 డిస్కౌంట్ కూపన్ లభిస్తుంది. అధికారిక వెబ్‌సైట్‌లో కొనేవారికి 6 నెలలు అదనంగా వారెంటీ, రెండు రెట్లు రియల్‌మీ కాయిన్స్ లాంటి ఆఫర్స్ లభిస్తాయి. రియల్‌మీ 11 ప్రో మూడు వేరియంట్లలో రిలీజైంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999 కాగా, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999. ఇక హైఎండ్ వేరియంట్ 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.27,999. ప్రీ-బుకింగ్ ప్రారంభమైంది. రూ.1,000 బ్యాంక్ డిస్కౌంట్‌తో పాటు రూ.500 ఆఫ్ కూపన్ పొందొచ్చు. దీంతో పాటు రియల్‌మీ వాచ్ కొనడానికి రూ.1,000 డిస్కౌంట్ కూపన్ లభిస్తుంది. అధికారిక వెబ్‌సైట్‌లో కొనేవారికి 6 నెలలు అదనంగా వారెంటీ, రెండు రెట్లు రియల్‌మీ కాయిన్స్ లాంటి ఆఫర్స్ లభిస్తాయి. ఈ ప్రీబుక్ ఆఫర్స్ జూన్ 15 వరకు లభిస్తాయి. రియల్‌మీ 11 ప్రో ప్లస్ ఓపెన్ సేల్ జూన్ 15న, రియల్‌మీ 11 ప్రో ఓపెన్ సేల్ జూన్ 16న ప్రారంభం అవుతుంది. ఈ రెండు మొబైల్స్ సన్‌రైస్ బీగీ, ఒయాసిస్ గ్రీన్, ఆస్ట్రాల్ బ్లాక్ కలర్స్‌లో లభిస్తాయి. ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ ఆన్‌లైన్ స్టోర్, రీటైల్ స్టోర్లలో కొనొచ్చు.  రియల్‌మీ 11 ప్రో సిరీస్‌లోని రెండు మొబైల్స్‌లో కామన్‌గా ఉన్న ఫీచర్స్ చూస్తే 6.7 అంగుళాల కర్వ్‌డ్ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ సపోర్ట్ ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 12జీబీ వరకు ర్యామ్, 256జీబీ వరకు స్టోరేజ్ సపోర్ట్ ఉంది. రియల్‌మీ యూఐ 4.0 + ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. రియల్‌మీ 11 ప్రో, రియల్‌మీ 11 ప్రో ప్లస్ మొబైల్స్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ సపోర్ట్ ఉంది. వీటి మధ్య తేడాలు చూస్తే రియల్‌మీ 11 ప్రో మొబైల్‌కు 67వాట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తే, రియల్‌మీ 11 ప్రో ప్లస్ మోడల్‌కు 100వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. రియల్‌మీ 11 ప్రో మొబైల్‌లో 100మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటే, రియల్‌మీ 11 ప్రో ప్లస్‌లో 200మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. రెండు ఫోన్లలో 8మెగాపిక్సెల్ అల్‌ట్రావైడ్, 2మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాలు ఉన్నాయి. రియల్‌మీ 11 ప్రో ప్లస్‌లో 32మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటే, రియల్‌మీ 11 ప్రో మోడల్‌లో 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. offerbazar24/7

Post a Comment

0 Comments

Close Menu