Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Tuesday, June 13, 2023

జులై 11న నథింగ్ ఫోన్ 2 విడుదల

                                     

దేశీయ మార్కెట్లో జులై 11న నథింగ్ ఫోన్ 2 విడుదల చేస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. భారత్‌లో నథింగ్ ఫోన్ 2 రూ. 40,000కు ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులో ఉంటుంది. లేటెస్ట్ 5జీ ఫోన్ టీజర్లు ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంలో సందడి చేస్తున్నాయి. ఈ ధరలో నథింగ్ ఫోన్ 2 వన్‌ప్లస్ 11ఆర్‌, గూగుల్ పిక్సెల్ 7ఏ వంటి స్మార్ట్‌ఫోన్లకు దీటైన పోటీ ఇస్తుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. ఇక నథింగ్ ఫోన్ 1 భారత్‌లో రూ. 32,999కి ప్రవేశపెట్టారు. నథింగ్ ఫోన్ 2 డిజైన్ నథింగ్ ఫోన్ 1ను పోలిఉంటుందని చెబుతున్నారు. నథింగ్ ఫోన్ 1తో పోలిస్తే ఫోన్ 2 మరింత కస్టమైజేషన్ ఆప్షన్లు, ఫంక్షనాలిటీని కలిగిఉంటుందని కంపెనీ సీఈవో కార్ల్ పీ వెల్లడించారు. యూజర్లకు మెరుగైన సాఫ్ట్‌వేర్ ఎక్స్పీరియన్స్‌ను అందించడంపై ఫోకస్ పెట్టినట్టు కంపెనీ సంకేతాలు పంపింది. యూజర్లకు రిఫ్రెషింగ్ లుక్‌ను అందించేందుకు న్యూ నథింగ్ ఫోన్ బ్యాక్ ప్యానెల్‌లో కొన్ని మార్పులు చేపట్టవచ్చని చెబుతున్నారు. ఫోన్ 2 వెనుకభాగంలో సేమ్ ఎల్ఈడీ డిజైన్ ఉంటుందని భావిస్తున్నారు. నథింగ్ ఫోన్ 2 ఫ్లాగ్‌షిప్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 చిప్‌సెట్‌తో 6.7 ఇంచ్ డిస్‌ప్లే, ఫాస్ట్‌చార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 4700ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో కస్టమర్ల ముందుకు రానుంది. ఇక నథింగ్ ఫోన్ 2 కెమెరా సెన్సర్ల వివరాలను ఇప్పటివరకూ కంపెనీ వెల్లడించలేదు.https://t.me/offerbazaramzon

No comments:

Post a Comment

Popular Posts