Ad Code

భారత్‌లోనే నథింగ్ ఫోన్ 2 తయారీ !


దేశీయ మార్కెట్లోకి నథింగ్ ఫోన్ (2) రాబోతోంది. నథింగ్ ఫోన్ (1) అప్‌గ్రేడ్ వెర్షన్‌గా జూలైలో లాంచ్ కానుంది. భారత్‌లోనే ఈ ఫోన్ తయారీ ప్రారంభం కానుందని కంపెనీ క్లారిటీ ఇచ్చింది. వన్‌ప్లస్ కో-ఫౌండర్ కార్ల్ పీ నేతృత్వంలోని యూకే-ఆధారిత స్టార్టప్ నుంచి ఫస్ట్ జనరేషన్ స్మార్ట్‌ఫోన్‌పై అనేక అప్‌గ్రేడ్‌లతో రానుందని భావిస్తున్నారు. Qualcomm నుంచి శక్తివంతమైన Snapdragon 8+ Gen 1 చిప్‌సెట్‌ను కలిగి ఉండనుంది. ఈ హ్యాండ్‌సెట్ లాంచింగ్ ముందు, ఫోన్ స్పెసిఫికేషన్‌ల వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. రీసైకిల్ చేసిన మెటీరియల్స్, ప్లాస్టిక్ రహిత ప్యాకేజింగ్‌తో సహా నథింగ్ ఫోన్ 2 రానుంది. రాబోయే నథింగ్ ఫోన్ 2 భారత్‌లోనే తయారు కానుందని లండన్‌కు చెందిన సంస్థ ప్రకటించింది. భారత్‌లో అసెంబ్లింగ్ చేసిన కంపెనీ నుంచి ఇది మొదటి స్మార్ట్‌ఫోన్ కాదు. గత ఏడాదిలో నథింగ్ ఫోన్ 1 భారత మార్కెట్లోనే తయారు అవుతుందని కంపెనీ వెల్లడించింది. అయితే, దేశవ్యాప్తంగా 270కి పైగా కస్టమర్ సర్వీసు సెంటర్లను ఏర్పాటు చేసింది. నథింగ్ ఫోన్ 2 6.7-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుందని అంచనా. నథింగ్ ఫోన్ (1) కన్నా కొంచెం పెద్దదిగా ఉంటుందని కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. ఈ హ్యాండ్‌సెట్‌లో 4,700mAh బ్యాటరీతో రానుంది. నథింగ్ ఫోన్ (1)లోని 4,500mAh బ్యాటరీ కన్నా పెద్ద పరిమాణంలో ఉంటుందని Pei ధృవీకరించింది. Qualcomm ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ Snapdragon 8+ Gen 1 SoC ద్వారా నథింగ్ ఫోన్ (2) రానుంది. అంతేకాదు.. గత ఫోన్ (1) Snapdragon 778G+ కన్నా శక్తివంతమైనది. ఈ వివరాలు గతంలో Qualcomm ఎగ్జిక్యూటివ్ ద్వారా లీక్ అయ్యాయి. ఆ తరువాత Pei ద్వారా వెరిఫై అయ్యాయి. గత నెలలో, Geekbench 5 సింగిల్-కోర్, మల్టీ-కోర్ టెస్టుల్లో 1253, 3833 పాయింట్ల స్కోర్‌తో ఫోన్ Geekbenchలో కనిపించింది. ఈ ఫోన్ 12GB RAM ఫీచర్‌తో వచ్చింది. ఆండ్రాయిడ్ 13తో రన్ అవుతుంది. ఈ ఫోన్ దేశంలో లాంచ్ కావడానికి ముందే BIS సర్టిఫికేషన్‌ను కూడా పొందినట్లు తెలిపింది. ఈ ఫోన్ 3 ఏళ్ల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లను, 4 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందుకుంటుంది. OnePlus, Oppo వంటి సంస్థలతో సమానంగా వస్తుంది. 

Post a Comment

0 Comments

Close Menu