అమెరికా లోని కాలిఫోర్నియాలో జరిగిన డబ్ల్యూడబ్ల్యూడీసీ 2023 ఈవెంట్ లో యాపిల్ రెండు మ్యాక్ బుక్ లను లాంచ్ చేసింది. టైప్ సీ పోర్ట్ లతో తీసుకొస్తున్న ఈ మ్యాక్ బుక్ లు.. మ్యాక్ బుక్ ఎయిర్ ఎమ్ 2 15", 13 inchలుగా రెండు వేరియంట్ లలో లాంచ్ అయ్యాయి. 13 అంగుళాల మ్యాక్ బుక్ ధర రూ.1,19,900, 15 అంగుళాల మ్యాక్ బుక్ ధర రూ. 1,34,900 ఉంది. ఈ రెండు మ్యాక్ బుక్ లు యాపిల్ ఇండియా వెబ్ సైట్ లో, యాపిల్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. 13.6 అంగుళాలు కలిగిన ఈ మ్యాక్ బుక్ లిక్విడ్ రెటీనా డిస్ ప్లేతో వస్తుంది. ఎం2 చిప్ సెట్ తో పనిచేస్తుంది. 2టీబీ ఎస్ఎస్డీ మెమరీ కలిగి ఉంటుంది. 1080p HD వెబ్ కెమెరా.. డాల్బీ అట్మోస్ తో నాలుగు-స్పీకర్ సౌండ్ సిస్టమ్ లు ఉన్నాయి. అంతేకాకుండా ఇది మ్యాజిక్ కీబోర్డ్, ఫోర్స్ టచ్ ట్రాక్‌ప్యాడ్‌తో వస్తుంది. 67 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వచ్చే ఈ మ్యాక్ బుక్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 18 గంటలు వాడుకోవచ్చు. 15.3 అంగుళాల లిక్విడ్ రెటీనా డిస్ ప్లేతో వస్తుంది. 8 కోర్ సీపీయూ, 16 కోర్ న్యూరల్ ఇంజిన్ ఉన్నాయి. డాల్బీ అట్మాస్ సౌండ్ సపోర్ట్ తో ఆరు స్పీకర్స్ తో వస్తుంది. మిగతా స్పెసిఫికేషన్స్ అన్నీ 13 అంగుళాల మ్యాక్ బుక్ లాగానే ఉంటాయి.offerbazar24/7
Search This Blog
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
Andhra Pradesh State board of Secondary Education BSEAP, conducted AP SSC/X Class/10th Class Examination 2013 on March/April 2013. An...
-
1. LifeHacker.co.uk LifeHacker aims to help its users out with life in the modern world. Popular tags include ‘Productivity’, ‘Money’ a...
-
Type Indian langauges in windows applications with Anu script manager 7.0 Supported Langauges: - Hindi, Devnagari, Telugu, Tamil, Ka...
No comments:
Post a Comment